Gudivada Amarnath: రాజధాని అంశంపై గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు
రాజధాని అంశంపై ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Gudivada Amarnath: రాజధాని అంశంపై ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖ వస్తారని స్పష్టం చేశారు. వైజాక్ నుంచే పాలన ప్రారంభమవుతుందని అమర్నాథ్ అన్నారు.
వచ్చే అకడమిక్ ఇయర్ విశాఖ నుంచే
వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచి రాజధాని కార్యకలాపాలు కూడా మొదలవుతాయని అన్నారు.
అందరూ అనుకున్న సమయం కంటే ముందే ముఖ్యమంత్ర జగన్ విశాఖ వస్తారని.. అక్కడి నుంచే పాలన కొనసాగిస్తారని చెప్పారు.
గత కొన్ని నెలలుగా రాజధాని విషయంలో అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.
స్పష్టం చేసిన సీఎం జగన్(Gudivada Amarnath)
విశాఖ నుంచే పాలన జరుగుతుందని, అందుకు తగిన ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయని పలు సందర్భాల్లో వైఎస్సార్పీపీ నేతలు తెలిపారు.
తాజాగా విశాఖలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో సీఎం జగన్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు.
రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయన్న ఆయన.. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయని,
భౌగోళికంగా పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతోందని, తాను కూడా విశాఖ నుంచే పాలన చేయబోతున్నానని ప్రకటించారు.
ఏపీలో క్రీయాశీలక ప్రభుత్వం
రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయన్నారు. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయన్నారు.
భౌగోళికంగా పరిశ్రమలకు ఏపీ అనుకూలమని, రాష్ట్రంలో పారిశ్రామిక విధానం సులువుగా ఉందన్నారు.
ఏపీలో క్రీయాశీలక ప్రభుత్వం ఉందని .. త్వరలోనే విశాఖ పరిపాలన రాజధాని కాబోతోందన్నారు. తాను కూడా విశాఖ నుంచే పాలన చేయబోతున్నట్టు.. త్వరలోనే అది సాకారమవుతుందన్నారు.
మరోవైపు ఏపీకి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా చెబుతున్నమని పేర్కొన్నారు. వైఎస్ జగన్. 340 సంస్థలు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయని తెలిపారు.
తొలిరోజు 92 ఎంవోయూలు రాగా మొత్తం 340 ఎంవోయూలు.. దీని ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540 సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు.
ఒక్క ఫోన్ కాల్‌తో సమస్యలు పరిష్కరిస్తామని.. భవిష్యతులో గ్రీన్, హైడ్రో ఎనర్జీల్లో ఏపీదే కీలక పాత్ర అని జగన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- Barley Seeds: వీటిలొ శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్
- Whatsapp spam calls: ఇక వాట్సాప్ స్పామ్ కాల్స్ కు చెక్ .. త్వరలో కొత్త ఫీచర్