Home / ఆంధ్రప్రదేశ్
తెలుగుదేశం పార్టీ జాతీయన ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన దేవగుడి క్యాంప్ సైట్ వద్ద చేనేత కార్మికులతో ముఖా ముఖి నిర్వాహించారు.
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
తెలుగుదేశం పార్టీ జాతీయన ప్రధాన కార్యదర్శి చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర నాలుగు రోజుల తర్వాత తిరిగి ప్రారంభం అయింది. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలో లోకేశ్ యాత్ర కొనసాగుతోంది.
ఏపీ సీఎం జగన్ పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై.. తమ్మినేని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రామోజీ సంస్థల అథినేత రామోజీ రావుకు ఏపీ సీఐడీ ఊహించని షాక్ ఇచ్చింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు హోమ్ శాఖ సీఐడీని అనుమతించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులు, డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మృతి చెందిన భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిందో భార్య. ఈ ఘటన జిల్లాలోని పత్తికొండ పట్టణంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
రాజోలు ఎమ్మెల్యే రాపాక ప్రసాద్ కుమారుడి పెళ్లి త్వరలో జరగనుంది. అయితే రాపాక తన కుమారుడి వివాహానికి ఏర్పాట్ల విషయంలో ట్రోలింగ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. పెళ్లి కోసం ముద్రించిన శుభలేఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆయన భార్య భారతి రెడ్డి చిత్రాలను ముద్రించారు. అదే విధంగా వారి ఆశీస్సులతో తన కుమారుడి పెళ్లి జరుగుతోందని అందులో రాయించారు.
తిరుమల ఘాట్ రోడ్డు లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొండ నుంచి తిరుపతికి మొదటి ఘట్ రోడ్డు మీదుగా కిందికి దిగుతున్న టెంపో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది భక్తులు గాయపడ్డారు.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించే అర్హత చంద్రబాబు లేదని.. వైకాపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఈ మేరకు తాడేపల్లి లోనో వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో కడలి నని విరుచుకుపడ్డారు. చంద్రబాబు.. ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్నారు.
ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ – ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం విజయవంతంగా పూర్తి అయ్యింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం వేదికగా జరిగిన ఈ ప్రయోగంలో జీఎస్ఎల్వీ – ఎఫ్ 12 రాకెట్ నింగి లోకి దూసుకెళ్లి.. 2వేల 232 కిలోల బరువుతో NVS -01 ఉపగ్రహాన్ని మోసుకెళ్లి నిర్ణీత వ్యవధిలో కక్ష్యలో ప్రవేశపెట్టింది. దాదాపు 19 నిమిషాల ప్రయాణం తర్వాత.. ఎన్వీఎస్-O1 ఉపగ్రహం ఖచ్చితంగా