Home / ఆంధ్రప్రదేశ్
టీటీడీ ఛైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదివరకు వైఎస్సార్ హయాంలో 2006-2008 మధ్య టీటీడీ ఛైర్మన్గా భూమన పని చేశారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా భూమన ఉన్నారు. ఈ నెల 8వ తేదీతో వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియనుంది. టీటీడీ ఛైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలను ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ వైఖరి ప్రతిపక్షం గొంతు నొక్కేలా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం మంగళగిరిలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాజా పరిణామాలతో ముందస్తు ఎన్నికలు రావచ్చనిపిస్తోందని అన్నారు.పదేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డామన్నారు.
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు కూడలిలో హైటెన్షన్ నెలకొంది. చంద్రబాబు రోడ్ షోను సందర్భంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండపడ్డారు. చంద్రబాబు తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పోలవరాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారని మంత్రి అంబటి ప్రశ్నించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 10వ తేదీ నుంచి విశాఖ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. యాత్రలో భాగంగా 6 ఫీల్డ్ విజిట్స్ , 2 బహిరంగ సభలు, ఒక జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఏపీలో గత కొన్ని రోజులుగా వాలంటీర్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కొందరు వాలంటీర్ల నేరాలు, డేటా సేకరణ వంటి అంశాలు ఏపీలో ఎంతటి కలకలం సృష్టిస్తున్నాయో అందరికీ తెలిసిందే. కాగా కొద్ది రోజుల క్రితమే వాలంటీర్ బనాగరం కోసం ఓ మహిళను దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.
చిత్తూరు జిల్లాలో ఒకే రోజు నలుగురు అమ్మాయిల కనిపించకుండా పోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా అమ్మాయిలకు రక్షణ కరువైన విషయం తెలిసిందే. బయట వ్యక్తుల నుంచే కాకుండా.. ఇంట్లోని వ్యక్తుల నుంచి కూడా ఆడ పిల్లలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువంటి ఈ
AP High Court : జగన్ సర్కారుకి ఏపీ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై స్టే విధిస్తూ తాజాగా తీర్పు వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అమరావతి పరిధిలో భూ పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై అమరావతి రైతులు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు ఈ తరరపు ఇచ్చింది. మరి హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ […]
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ).. దేశ వ్యాప్తంగా 20 యూనివర్సిటీ లను ఫేక్ యూనివర్సిటీ లుగా గుర్తించింది. కాగా ఆయా విశ్వవిద్యాలయాలకు డిగ్రీలు ప్రధానం చేసే అధికారం లేదని ప్రకటించింది. ఆ యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలతో ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని తేల్చేసింది.