Pawan Kalyan Mother Health: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లికి అనారోగ్యం.. క్యాబినెట్ భేటీ నుంచి హైదరాబాద్ పయనం..!

Deputy CM Pawan Kalyan Mother Anjana Devi Illness: ఏపీలో అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం హాజరయ్యారు. అయితే సమావేశం ప్రారంభమైన కాసేపటికే పవన్ కల్యాణ్‌కు ఫోన్ కాల్ వచ్చింది. పవన్ కల్యాణ్ తల్లి అంజనా దేవికి అస్వస్థత ఉందని కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన వెంటనే సీఎం చంద్రబాబుకు తన తల్లి అంజనా దేవికి అనారోగ్యం ఉందని సమాచారం అందించారు. అనంతరం హుటాహుటినా క్యాబినెట్ భేటీ నుంచి బయటకు వచ్చారు. అక్కడినుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. కాసేపట్లో పవన్ కల్యాణ్ హైదరాబాద్ చేరుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.