Last Updated:

CM YS JAGAN : నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నిధులు విడుదల చేసిన సీఎం జగన్..

ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేతలపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేడు కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని జనుపల్లి గ్రామంలో సీఎం జగన్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా  వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో నాలుగో విడత వడ్డీ డబ్బులను జమ చేశారు.

CM YS JAGAN : నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నిధులు విడుదల చేసిన సీఎం జగన్..

CM YS JAGAN : ఏపీ సీఎం జగన్ (CM YS JAGAN) ప్రతిపక్ష నేతలపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేడు కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని జనుపల్లి గ్రామంలో సీఎం జగన్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా  వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో నాలుగో విడత వడ్డీ డబ్బులను జమ చేశారు. కాగా సుమారు రూ.1,353.76 కోట్ల వడ్డీని బటన్ నొక్కి రిలీజ్ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా కోటీ 5 లక్షల మంది మహిళలకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. ప్పటిదాకా 4,969.05 కోట్లను మహిళల ఖాతాలకు బదిలీ చేసినట్లు తెలిపారు. మహిళలను మోసం చేసిన చరిత్ర నారా వారిదేనని జగన్‌ మండిపడ్డారు.

ఇంకా మాట్లాడుతూ.. 2016 లో సున్నా వడ్డీ పథకాన్నిచంద్రబాబు రద్దు చేశారని, వడ్డీని మాఫీ చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు అరాచకాలను తలుచుకుంటే బాధనిపిస్తుందని అన్నారు. బాబు హయాంలో రూ.14 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారని.. మహిళలను గత ప్రభుత్వం రోడ్డున పడేసిందని, నాటి బకాయిలను తాము చెల్లించామని చెప్పారు. మహిళలు సంతోషంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. అందుకే సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్దరించినట్టుగా సీఎం జగన్ వివరించారు. ఈ కారణంగా తమ ప్రభుత్వంపై పెనుభారం పడిందని ఆయన గుర్తు చేశారు.

 

 

తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ బీసీ నేస్తం, వైఎస్ఆర్ ఆసరా లాంటి పథకాలను అమలు చేస్తూ పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నామన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి పథకం ఎక్కడా లేదని ఆయన గుర్తు చేశారు. సున్నా వడ్డీ పథకం కింద మూడు విడతల్లో రూ. 19 వేల కోట్లను లబ్దిదారులకు అందించినట్టుగా సీఎం జగన్ చెప్పారు. కోటి 5 లక్షల మంది మహిళలకు సున్నా వడ్డీ నిధులు అందిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సీఎం జగన్ చెప్పారు.