AP Inter Exams: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులకు సీఎం విషెస్

CM Chandrababu wishes to students for AP Inter Exams: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు 17వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని చెప్పారు. పిల్లలందరూ ఒత్తిడికి గురికాకుండా ఎగ్జామ్స్ రాయాలని మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో డీహైడ్రేట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ సూచించారు. ప్రయత్నం సరిగ్గా చేస్తే తప్పకుండా విజయం సాధిస్తుందని ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా, ఇంటర్ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 10 లక్షలమంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా,, పేపర్ లీకేజీ వంటి పుకార్లు సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. నేటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కాగా, మార్చి 3 వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. కాగా, నిమిషం నిబంధన అమలులో ఉంటుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఇంటర్మీడియన్ పరీక్షలు మార్చి 20 వరకు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,535 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ ఏడాదిలో మొత్తం 10,58,893 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇందులో ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులు 5,00,963 ఉండగా.. ఒకేషనల్ విద్యార్థులు 44,581 మంది ఉన్నారు. సెకండ్ ఇయర్ విద్యార్థులు 4,71,021 ఉండగా.. ఒకేషనల్ విద్యార్థులు 42,328 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు అమర్చినట్లు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినర్ సుబ్బారావు తెలిపారు.