Nara Chandrababu Naidu : చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ విషయంలో కోర్టు విధించిన షరతులు ఇవే..
తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నచంద్రబాబుకు తాజాగా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. నాలుగు వారాలపాటు చంద్రబాబుకు బెయిల్ ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై
Nara Chandrababu Naidu : తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నచంద్రబాబుకు తాజాగా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. నాలుగు వారాలపాటు చంద్రబాబుకు బెయిల్ ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై సోమవారం విచారణ పూర్తి చేసిన హైకోర్టు.. నేడు తీర్పు ఇచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్ వేశారు. న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు.
సాయంత్రం విడుదల కానున్న చంద్రబాబు..
గత నెల రోజులకు పైనుంచి ఆయన రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో ఉంటున్నారు. మరోవైపు తనపై సీఐడీ నమోదు చేసిన కేసులు తప్పు అని, వాటిని కొట్టేయాలని సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఇంకా విచారణ దశలోనే ఉంది. అయితే బాబు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా నవంబర్ 24 వరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా.. పలు షరతులు విధించింది. చంద్రబాబు వెంట ఇద్దరు డీఎస్పీలను ఉంచుతామని సీఐడీ లాయర్లు కోరగా, పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. కోర్టు ఆర్డర్లు అందిన తర్వాత సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.
చంద్రబాబుకు కోర్టు విధించిన షరతులు ఇవే..
రూ.లక్ష చొప్పున 2 ష్యూరిటీలను కోర్టుకు సమర్పించాలి.
నచ్చిన ఆస్పత్రిలో సొంత ఖర్చులతోనే చికిత్స తీసుకోవాలి. ఆ ఆస్పత్రి, చికిత్సకు సంబంధించిన వివరాలను జైలు సూపరింటెండెంట్కు సమర్పించాలి.
ఆస్పత్రి, ఇంటికి మాత్రమే పరిమితం కావాలి.
ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసును ప్రభావితం చేసేలా మాట్లాడకూడదు.
ఆ కేసుకు సంబంధించిన వ్యక్తులను కలవకూడదు.
నవంబర్ 28న సా.5 గంటల్లోపు జైలులో సరెండర్ కావాలి.