Last Updated:

Today Panchangam : నేటి (మార్చి 24, శుక్ర వారం) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : నేటి (మార్చి 24, శుక్ర వారం) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ మాసంలో నేటి (మార్చి 24 ) శుక్రవారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి ఛైత్రం 03, శాఖ సంవత్సరం 1944, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం, తదియ తిథి, విక్రమ సంవత్సరం 2079. రంజాన్ 01, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 24 మార్చి 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. తదియ తిథి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత చతుర్థి తిథి ప్రారంభమవుతుంది. అశ్వినీ నక్షత్రం మధ్యాహ్నం 1:22 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. విష్కుంభ యోగం మధ్యాహ్నం 1:42 గంటల వరకు ఉంటుంది. ఈరోజు మేష రాశిలోనే చంద్రుడు పగలు, రాత్రి సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : గౌరీ వ్రతం, శ్రీ మత్స్య జయంతి

సూర్యోదయం సమయం 24 మార్చి 2023 : ఉదయం 6:21 గంటలకు

సూర్యాస్తమయం సమయం 24 మార్చి 2023 : సాయంత్రం 6:34 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..

అభిజీత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:03 గంటల నుంచి మధ్యాహ్నం 12:52 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:19 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:04 గంటల నుంచి రాత్రి 12:51 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 6:33 గంటల నుంచి సాయంత్రం 6:57 గంటల వరకు

అమృత కాలం : ఉదయం 6:24 గంటల నుంచి ఉదయం 7:57 గంటల వరకు

సర్వార్ధ సిద్ధి యోగం : ఉదయం 6:21 గంటల నుంచి మధ్యాహ్నం 1:22 గంటల వరకు ఉంటుంది.

రవి యోగం : మధ్యాహ్నం 1:22 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:20 గంటల వరకు ఉంటుంది.

(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..

రాహూకాలం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు

యమగండం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు

దుర్ముహర్తం : ఉదయం 8:48 గంటల నుంచి ఉదయం 9:37 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 12:52 గంటల నుంచి మధ్యాహ్నం 1:41 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు చంద్రఘంట మాతను పూజించాలి. 5 మంది స్త్రీలకు స్వీట్లు తినిపించి, దుర్గా సప్తశతి పఠించాలి.