Last Updated:

Upcoming Releases : ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏవంటే ?

జూలై నెలలో మొదటి వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో అనూహ్య రీతిలో ఒక చిత్రం మంచి సక్సెస్ అందుకోగా.. మరో చిత్రం యావరేజ్ టాక్ తో నడుస్తుంది. ఇక ఇప్పుడు రెండో వారంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పలు చిన్న సినిమాలతో పాటు, డబ్బింగ్‌ సినిమాలు రెడీ అయ్యాయి. వీటికి పోటీగా హాలీవుడ్

Upcoming Releases : ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏవంటే ?

Upcoming Releases : జూలై నెలలో మొదటి వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో అనూహ్య రీతిలో ఒక చిత్రం మంచి సక్సెస్ అందుకోగా.. మరో చిత్రం యావరేజ్ టాక్ తో నడుస్తుంది. ఇక ఇప్పుడు రెండో వారంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పలు చిన్న సినిమాలతో పాటు, డబ్బింగ్‌ సినిమాలు రెడీ అయ్యాయి. వీటికి పోటీగా హాలీవుడ్ మూవీ కూడా ఉండడం ఈ వారం మూవీ లవర్స్ కి మంచి ట్రీట్ అని చెప్పాలి. మరి ఈ తరుణంలోనే ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

ఈ వారం థియేటర్‌ వేదికగా విడుదలయ్యే చిత్రాలు..

బేబి.. 

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ తనదైన శైలిలో దూసుకుపోతూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ నటిస్తున్న చిత్రం “బేబీ”. ఇందులో యూట్యూబ్ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుండగా .. విరాజ్ అశ్విన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. డైరెక్టర్ మారుతీ, నిర్మాత ఎస్కేఎన్ కలిసి మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. 2020లో కలర్ ఫోటోతో ప్రేక్షకులను మెప్పించిన సాయి రాజేష్.. ఈ సినిమాతో డైరెక్టర్ గా మ్యాజిక్ చేయబోతున్నారని ప్రేక్షకులకు అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Baby Movie (2023) Cast, Roles, Trailer, Story, Release Date, Poster

నాయకుడు.. 

ఉదయనిధి స్టాలిన్‌, వడివేలు, ఫహద్‌ ఫాజిల్‌, కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రల్లో మారి సెల్వరాజ్‌ తెరకెక్కించిన చిత్రం ‘మామన్నన్‌’. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని ఇప్పుడు ‘నాయకుడు’ (Nayakudu) పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. దీన్ని ఏషియన్‌ మల్టీప్లెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు ఈ నెల 14న తెలుగులో విడుదల చేయనున్నాయి.

మహావీరుడు.. 

శివ కార్తికేయన్‌ హీరోగా మడోన్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ చిత్రం ‘మహావీరుడు’. అరుణ్‌ విశ్వ నిర్మాతగా చేస్తుండగా.. ప్రముఖ డైరెక్టర్ శంకర్ కుమార్తె.. అదితి శంకర్‌ హీరోయిన్ గా నటిస్తుంది. మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

భారతీయన్స్‌..

నీరోజ్‌ పుచ్చా, సోనమ్‌ టెండప్‌, సుభారంజన్‌, మహేందర్‌ బర్గాస్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన భారతీయన్స్‌. సమైరా సంధు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్‌ నాంగ్యాల్‌ కథానాయికలు. దీన్‌రాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డా.శంకర్‌నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 14న థియేటర్‌లో విడుదల కానుంది.

మిషన్‌ ఇంపాసిబుల్‌ : డెడ్‌ రెకనింగ్‌..

హాలీవుడ్ ప్రముఖ నటుడు టామ్ క్రూజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. విభిన్న కథలను ఎంచుకుంటూ అభిమానుల్లో తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ హీరో. ముఖ్యంగా మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులను పొందారు టామ్. ఇప్పటి వరకు ఈ సిరీస్ లో 6 సినిమాలు రాగా ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ 7 లో నటిస్తున్నాడు. క్రిస్టోఫర్‌, మెక్‌ క్యూరీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌  ‘మిషన్‌ ఇంపాసిబుల్‌ : డెడ్‌ రెకనింగ్‌’ (Mission Impossible – Dead Reckoning). రెండు భాగాలుగా రానుంది. ఈ సినిమా పార్ట్‌-1 జులై 12 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇంగ్లీష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లోనూ ఈ సినిమా అలరించనుంది.

Mission: Impossible – Dead Reckoning Part One Advance Booking Now Open in  India: BookMyShow, PayTM | Entertainment News

ఈ వారం ఓటీటీ వేదికగా విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు (Upcoming Releases)..

నెట్‌ఫ్లిక్స్‌.. 

బర్డ్‌ బాక్స్‌ బార్సిలోనా (హాలీవుడ్‌) జులై 14

కొహరా (హిందీ) జులై 15

అమెజాన్‌ ప్రైమ్‌..

ట్రాన్స్‌ఫార్మర్స్‌ : రైజ్‌ఆఫ్‌ ది బీస్ట్స్‌ (హాలీవుడ్‌) జులై 11

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌..

జానకి జానీ (మలయాళం) జులై 11

ది ట్రయల్‌ (హిందీ) జులై 14

జీ5..

మాయాబజార్‌ ఫర్‌ సేల్‌ (తెలుగు) జులై 14

సోనీలివ్‌..

క్రైమ్‌ పెట్రోల్‌ – 48 అవర్స్‌ (హిందీ) జులై 10

కాలేజ్‌ రొమాన్స్‌ (హిందీ) జులై 15

 

ఇవి కూడా చదవండి: