Trains cancelled: గోదావరి ఎక్స్ ప్రెస్ ప్రమాదం.. పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ రైల్వేస్టేషన్ సమీపంలో అంకుషాపూర్ సమీపంలో గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. విశాఖ నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Trains cancelled: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ రైల్వేస్టేషన్ సమీపంలో అంకుషాపూర్ సమీపంలో గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. విశాఖ నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ట్రాక్ పునరద్ధరణ పనులు యుద్ధ ప్రతిపాతిపదిక చేపట్టారు.
భారీ ఎత్తున సిబ్బంది, కార్మికులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మరమ్మత్తుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు సర్వీసులను రద్దు చేసింది . 7 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, 12 రైళ్లను తాత్కాలికంగా రద్దు అయ్యాయి.
రద్దు అయిన రైళ్లు(Trains cancelled)
కాచిగూడ-నడికుడి (07791)
నడికుడి-కాచిగూడ (07792)
సికింద్రాబాద్-వరంగల్ (07462)
వరంగల్-హైదరాబాద్ (07463)
సికింద్రాబాద్-గుంటూరు (12706)
గుంటూరు-సికింద్రాబాద్ (12705)
సికింద్రాబాద్-రేపల్లె (17645)
ప్రమాదం జరిగిన తీరిదే..
కాగా, బుధవారం తెల్లవారుజామున విశాఖ పట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ ప్రెస్ బీబీనగర్ దగ్గర పట్టాలు తప్పింది.
ఎక్స్ ప్రెస్ లోని ఎస్ -1, ఎస్ -2, ఎస్ – 3, ఎస్ – 4తో పాటు రెండు జనరల్ బోగీలు.. మొత్తం 6 బోగీలు పట్దాలు తప్పాయి. అయితే, అధునాతన టెక్నాలజీతో రూపొందించిన రైల్వే బోగీలు కావడంతో పెను ప్రమాదం తప్పింది.
ఘటన సంబంధించి ట్రాక్ మరమ్మత్తులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా, ఈ ప్రమాదంపై సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో రాకేష్ స్పందించారు. ఎల్ హెచ్ బీ కోచ్ టెక్నాలజీ తోనే ప్రమాద తీవ్రత తగ్గిందన్నారు.
ప్రమాదం జరిగినప్పుడు లింక్ హాఫ్ మన్ బుష్ కోచ్ ఉండటం వల్ల ఆటోమెటిక్ బ్రేక్ సిస్టమ్ పనిచేసిందని చెప్పారు. కోచ్ లు పక్కకు పోకుండా ఎల్ హెచ్ బీ టెక్నాలజీ ఉపయోగపడిందని ఆయన తెలిపారు.
అతి వేగమే కారణమా?
అయితే గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామన్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమా? అనే కోణంలో పరిశీలిస్తున్నామని తెలిపారు.
గంట ఆలస్యంగా గోదావరి నడిచిందని.. ఆ ఆలస్యాన్ని కవర్ చేసేందుకు రైలు వేగం పెరిగిందా అనేది విచారణ లో తేలుస్తామని పేర్కొన్నారు.
గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినప్పటికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.
విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727) రాకపోకలు సాగిస్తుంటుంది.
విశాఖలో సాయంత్రం 5.20కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.15కు నాంపల్లి స్టేషన్‌లో గమ్య స్థానానికి చేరుకుంటుంది. సికింద్రాబాద్‌కు తెల్లవారుజామున 5.10కి చేరుకుంటుంది.