Last Updated:

Sankranthi Rush: సంక్రాంతికి ఊరెళ్తున్న జనాలు.. టోల్ ప్లాజాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

Sankranthi Rush: సంక్రాంతికి ఊరెళ్తున్న జనాలు.. టోల్ ప్లాజాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

Sankranthi Rush:హైదరాబాద్ వాసులు సంక్రాంతికి పల్లెబాట పట్టారు. శుక్రవారం నుంచి సెలవులు కావడంతో సంక్రాంతికి సొంత ఊళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవే పై వాహనాల రద్దీ పెరిగింది. యాదాద్రి జిల్లా పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వెహికల్స్ బారులు తీరాయి. అటు వరంగల్ హైవే పైనున్న టోల్ గేట్ల వద్ద కూడా రద్దీ కొనసాగుతోంది. దాదాపు ఒక కిలో మీటర్ వాహనాలు నిలిచిపోయాయి. ఫాస్టాగ్ విధానం ఉన్నప్పటికీ.. వెహికల్ ఫ్లోటింగ్ ఎక్కువ కావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పటినట్టు టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడూ రివ్యూ చేస్తున్నారు. జాతీయ రహదారుల్లోని ప్రధాన సర్కిల్స్ లో ట్రాఫిక్ సమస్య ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సిటీలో తగ్గిన ట్రాఫిక్

నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లడంతో సిటీలో ట్రాఫిక్ రద్దీ తగ్గింది. హైదరాబాద్ లో స్థిరపడిన వాళ్లు, ఉద్యోగులు సంక్రాంతికి స్వస్ధలాలకు వెళుతుండటంతో రోడ్లపై వాహనాల రద్దీ తక్కువగా కనిపిస్తోంది. మరో వైపు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ఆర్టీస్ బస్ స్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

ప్రయాణికులతో కిటకిట

సంక్రాంతి రద్దీని ద్రుష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ జనవరి 10 నుంచి 19 వరకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయినా వ్యక్తిగత వాహనాలు, ట్రావెల్స్ కార్లు, ఇతర వాహనాల్లోనూ జనం ఊళ్లకు వెళుతున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్యాసింజర్స్ తో కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ కూడా ప్రత్యేక బసులు నడుపుతున్నా.. అన్నీ ఫుల్ అయ్యాయి. ఎంజీబీఎస్, దిల్ సుఖ్ నగర్ సహా ఎల్బీనగర్ , ఉప్పల్, కూకట్ పల్లి, ఆరాంఘర్ బస్ స్టాండ్లు ప్రయాణికులతో నిండిపోయాయి. దాదాపు 4 వేల స్పెషల్ బస్సులు వేసినా .. అవి ఏ మాత్రం సరిపోకపోవడంతో ప్రయాణికులు అసంత్రుప్తి చెందుతున్నారు.

ఇవీ చదవండి:

అమెరికాలో విమాన సర్వీసుల పునరుద్దరణ

వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ.. పూనకాలు తెప్పించిన మెగాస్టార్

పవన్ కళ్యాణ్ అభిమానులు సైకోలా.. మేకతోటి సుచరిత కామెంట్స్

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి: