Last Updated:

Kanuma Special: కనుమ చెప్పే మాట.. కలిసి జీవించడమే!

Kanuma Special: కనుమ చెప్పే మాట.. కలిసి జీవించడమే!

Kanuma Special: సంక్రాంతి తర్వాతి రోజు వచ్చేదే కనుమ. సంక్రాంతి ఎంత పెద్ద పండగ అయినా.. అది కనుమతోనే పూర్తవుతుంది. ఈ కనుమ పండగ రైతులకు ప్రత్యేకమైనది. రైతులకు పశువులకు విడదీయరాని సంబంధం ఉంది. అందేంటో ఇపుడు చూద్దాం.

 

వ్యవసాయంపై దేశంలో సగానికి పైగా రైతులు ఆధారపడి ఉన్నారు. వ్యవసాయంలో యాంత్రికత పెరిగిన కూడా.. చాలా చోట్ల పశువుల మీదే కొందరు ఆధారపడి రైతులు సాగు చేస్తున్నారు. అలాంటి పశువుల కోసమే కేటాయించింది ఈ పండగ. ఈ రోజు నా ఇంటికి వచ్చినా చుట్టాలను పంపించండానికి అప్పట్లో ఒప్పుకునేవారు కాదు. కాలక్రమంలో అది మార్పు చెందిన అప్పట్లో ఈ పండగ ప్రత్యేకతే వేరు.

 

వ్యవసాయంలో పొలాన్ని దున్నడం మెుదలు.. ధాన్యాన్ని ఇంటికి తీసుకురావడంలో పశువులు ఎంతగానో కృషి చేస్తాయి.

అలాంటి పశువులకే ఆటవిడుపు ఈ పండగ. పశువులు ఉన్న ఇళ్లలో ఈ రోజు సంబరాలు అంబరాన్ని అంటుతాయి.

పండుగ నాడు వాటికి స్నానాలు చేయిస్తారు. ఆపై మనసారా వారికి నచ్చినట్లుగా అలంకరణ చేస్తారు.

బొట్టు పెట్టడం.. కొమ్ములకు ఇత్తడి తొడుగులు వేయడం వరకూ వివిధ రీతుల్లో అలంకరిస్తారు.

తమిళనాడులో ఈ రోజు పూర్తిగా ఎడ్ల పండగే. ఈ రోజుని వాళ్లు మట్టు పొంగల్‌ అని కూడా అంటారు. మట్టు అంటే ఎద్దు అని అర్థం.

 

కనుమకి సంబంధించిన ఓ కథ ప్రచారంలో ఉంది. శివుడు తన నంది వాహనాన్ని పిలిచి.. ప్రజలకి ఓ సందేశాన్ని పంపించాడట.

ప్రజలు రోజు తమ ఒంటికి నూనె పట్టించి చేయాలని.. నెలకి ఓసారి మాత్రమే ఆహారం తీసుకోవాలని చెప్పాడట.

కానీ నంది కంగారుపడి ప్రతిరోజు తినమనీ.. నెలలో ఒక్కసారి మాత్రమే స్నానం చేయమని చెప్పిందట.

నంది చేసిన పనికి కోప్పడిన శివుడు.. శపించాడట. ప్రతిరోజు మానువులు తినాలంటే ఆహారాన్ని పండించాలి.. దానికి నువ్వే సాయపడు అని శపించాడట.

అప్పటి నుంచి రైతులకు ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయని ప్రజల నమ్మకం.

ఇక ఈ పండగ నాడు తెలుగు ప్రజలు గారెలను చేసుకుంటారు. కనుమనాడు కచ్చితంగా మినుములు తినాలన్న సామెత కూడా ప్రచారంలో ఉంది.

ఈ పండగ నాడు గారెలను తినడం వెనక ఆరోగ్య సూత్రం ఉంది. మినుములు మానవ శరీరంలో ఉష్ణాన్ని కలిగిస్తాయి. చలికాలం చలిని తట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

కనుమనాడు వరి కంకులని ఇంట్లో వేలాడదీసే ఆచారం కూడా ఉంది. పిచ్చుకలు, పక్షులు వచ్చి తినడానికే ఈ ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది.

నాగరికతని నేర్చుకున్న తరువాత అతనికీ మిగతా ప్రాణులకీ సాయపడటం నేర్చుకున్నాడు. చుట్టూ ఉన్న జీవరాశుల ఆకలి తీర్చినప్పుడే మనిషి జీవితానికి సార్థకత.

మనుషులతో పాటే జీవులు కూడా సమానమని దీనికి అర్ధం.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/