Last Updated:

Waltair Veerayya Review: వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ.. పూనకాలు తెప్పించిన మెగాస్టార్

Waltair Veerayya Review: వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ.. పూనకాలు తెప్పించిన మెగాస్టార్

Cast & Crew

  • చిరంజీవి (Hero)
  • శ్రుతి హాసన్ (Heroine)
  • రవితేజ, కేథరిన్, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్ రాజ్ (Cast)
  • కె ఎస్ రవీంద్ర (బాబీ) (Director)
  • నవీన్ యెర్నేని, వై రవిశంకర్ (Producer)
  • దేవిశ్రీ ప్రసాద్ (Music)
  • ఆర్ధర్ ఎ విల్సన్ (Cinematography)
3.2

Waltair Veerayya Review: సంక్రాంతి కి ఫ్యామిలీతో కలిసి థియేటర్లో సినిమా చూస్తే ఆ కిక్కే వేరు. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమా అయితే డబుల్ కిక్కు. ఆచార్య పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అభిమానుల ఆశలన్నీ ‘వాల్తేరు వీరయ్య’( Waltair Veerayya Review) పైనే పెట్టుకున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశారు. బాబీ డైరెక్షన్ లో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో రవితేజ కీలక పాత్ర పోషించడంతో సినిమా పై హైప్ బాగా క్రియేట్ అయింది. ఇదివరకే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే వాల్తేరు వీరయ్య గా చిరంజీవి ఆకట్టుకున్నారా..? ఈ సినిమా ప్రేక్షకులకు ఏ మేరకు నచ్చిందో చూద్దాం.

కథలోకి వెళితే..

వైజాగ్ వాల్తేరులోని జాలరి పేటలో ఉండే వాల్తేరు వీరయ్య( చిరంజీవి) ఆ పేటకు నాయకుడు లాంటివాడు. చుట్టు ప్రక్కల ప్రాంతాలతో పాటు సముద్రం అనువనువూ తెలిసిన వ్యక్తి. పోర్ట్ లోని నేవీ అధికారులకు, వాల్తేరు వీరయ్య కు మంచి సంబంధాలు ఉంటాయి. ఈ క్రమంలో వీరయ్య దగ్గరకు ఓ పోలీస్ అధికారి సీతాపతి( రాజేంద్రప్రసాద్) సాయం కోసం వస్తాడు. మలేషియా లో ఉండే ఓ డ్రగ్స్ డాన్ ( బాబీ సింహా) వల్ల పోలీస్ డిపార్ట్ మెంట్ చాలా నష్టపోతుంది. సీతాపతి కూడా సస్పెండ్ అవుతాడు. దీంతో డాన్ మీద పగ తీర్చుకునేందుకు వీరయ్య సాయపడితే ఎంత డబ్బు అయినా ఇస్తానని చెప్తాడు. దీంతో మలేషియా వెళ్లిన వీరయ్య డ్రగ్స్ డాన్ తో పాటు అతని అన్న మైఖేల్ సీజర్( ప్రకాశ్ రాజ్) వెంటపడతాడు. డాన్ కంటే కూడా వీరయ్య (Chiranjeevi) మైఖేల్ పట్టకోవడానికి కష్టపడుతున్నాడని సీతాపతి తెలుసుకుంటాడు. ఈ క్రమంలో మలేషియాలోని ఓ హోటల్ లో పనిచేస్తున్న అదితి( శ్రుతి హాసన్) తో ప్రేమలో పడతాడు వీరయ్య. అసలు మైఖేల్ వెంట వీరయ్య ఎందుకు పడతాడు? నిజాయితీగా డ్యూటీ చేసే ఏసీబీ వివేక్ సాగర్(రవితేజ) కు వీరయ్యతో ఉన్న గతం ఏంటీ? అనే విషయాలు తెరపై చూడాల్సిందే..

ఎలా ఉందంటే..

వాల్తేరు వీరయ్య (Waltair Veerayya Review) కథ కొత్తది కాకపోయినా.. సినిమా మొదలైనప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి మార్క్ కామెడీ, యాక్షన్, ఎంటర్ టైన్మెంట్ తో అందరినీ ఆకట్టుకున్నారు. మంచి ఎలివేషన్స్ తో ఒకప్పటి చిరంజీవిని గుర్తు చేశాడు దర్శకుడు బాబీ. మలేషియాలో తన గ్యాంగ్ తో వీరయ్య చేసే కామెడీ హైలెట్ గా ఉంటాయి. ఇంటర్వెల్ కు ముందు అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో రవితేజ ఎంట్రీతో సినిమా కొత్త మలుపు తీసుకుంటుంది. అసలు రవితేజకు, చిరంజీవి మధ్య రిలేషన్ ఏంటీ ? మైఖేల్ పై పగ తీర్చుకోవడానికి కారణమేంటో అనేవి తన మార్కు డైరెక్షన్ తో తెరకెక్కించాడు బాబీ. రవితేజ (Ravi teja) , చిరంజీవి కలిసి పూనకాలు లోడింగ్ పాటలో చేసిన డ్యాన్సులు అదరగొడతాయి. ఈ మూవీలో వింటేజ్ చిరంజీవితో పాటు రవితేజ సందడి.. కామెడీ పంచులు బాగా ఆకట్టుకుంటాయి. కథలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా మరో లెవల్ కు వెళ్లేది. చిరంజీవి ఫ్యాన్ బేస్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా రూపొందించారు దర్శకుడు బాబీ.

ఎవరెలా చేశారు

చాలా రోజుల తర్వాత పక్కా మాస్ లో కనిపించారు మెగాస్టార్. వీరయ్య పాత్రలో ఆద్యంతం ఆకట్టుకుంటారు చిరంజీవి (Chiranjeevi). తన మార్క్ కామెడీ పంచులు.. డ్యాన్సులతో పూనకాలు తెప్పిస్తారు. మరో వైపు రవితేజ పాత్ర స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. శ్రుతి హాసన్ చేసిన ఫైట్స్  కూడా ఆకట్టుకుంటాయి. ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, బాబీ సింహా, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్.. వారి ప్రాతల మేరకు నటించారు. తమ అభిమాన హీరోని ఎలా చూడాలనుకుంటారో.. అదే విధంగా చూపించారు బాబీ. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవీ శ్రీ ప్రసాద్ అందించిన.. పూనకాలు లోడింగ్, బాస్ పార్టీ లాంటి పాటలు విజువల్ ఫీస్ట్ లా ఉంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్ అందించిన నిర్మాణ విలువలు సినిమాను పైస్థాయిలో నిలిపాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అభిమానులకు పూనకాలు తెప్పించే పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ ‘వాల్తేరు వీరయ్య’.

 

ఇవీ చదవండి:

పవన్ కళ్యాణ్ అభిమానులు సైకోలా.. మేకతోటి సుచరిత కామెంట్స్

మీ అన్నతోనే సెల్ఫీ దిగలేదు.. నువ్వెంత.. పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని కామెంట్స్

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/Prime9Digital

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి: