Last Updated:

APSRTC: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సంక్రాంతికి 7,200 స్పెషల్ బస్సులు

APSRTC: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సంక్రాంతికి 7,200 స్పెషల్ బస్సులు

APSRTC Announcess 7200 Special Buses For Sankranthi: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అడిషనల్ బస్సులు నడిపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ మేరకు నేటి నుంచి ఈనెల 13 వరకు అడిషనల్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఒక్క హైదరాబాద్ నుంచి పలు చోట్లకు దాదాపు 2,153 బస్సులు నడపనుంది.

అలాగే, బెంగళూరు నుంచి పలు చోట్లకు 375 బస్సులు నడపనుంది. విజయవాడ నుంచి 300 అడిషనల్ బస్సులు, విశాఖపట్నం 250 బస్సులు నడపనుంది. దీంతో పాటు తిరుగు ప్రయాణాలకు ఈనెల 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంది. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆర్టీసీ వెల్లడించింది. సాధారణ బస్సు ఛార్జీలే ప్రత్యేక బస్సుల్లో ఉంటాయని ఆర్టీసీ వివరించింది. సంక్రాంతి దృష్ట్యా 7,200 అడిషనల్ బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉండగా, సంక్రాంతి పండుగకు సంబంధించి సొంత గ్రామాలకు ప్రయాణికులు వెళ్లనున్నారు. ప్రయాణికుల రాకతో బస్టాండ్లు రద్దీగా మారునున్నాయి. ఇందులో భాగంగానే ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ బస్టాండ్ సహా రద్దీ పెరుగుతున్న దృష్ట్యా నేటి నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొత్తం సంక్రాంతి ముందు, తర్వాత 7,200 అడిషనల్ బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు నిర్థయించారు. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు ఏర్పాట్లు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఇప్పటికే అన్ని డిపోల నుంచి బస్సులను సమీకరించుకొని ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి నుంచి 13 వరకు 3,900 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. అయితే పండుగ తర్వాత కూడా తిరుగు ప్రయాణానికి గానూ 3,300 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. అయితే ఛార్జీలు ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. కాగా, రాను పోనూ ఒకేసారి బుకింగ్ చేసుకుంటే ఛార్జీలో 10శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయంచింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.