Last Updated:

Republic Day: రాజ్ భవన్ రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ డుమ్మా.. మళ్లీ వివాదం లేపిన గవర్నర్ తమిళ సై వ్యాఖ్యలు..

తెలంగాణ రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళ సై జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. 

Republic Day:  రాజ్ భవన్ రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ డుమ్మా.. మళ్లీ వివాదం లేపిన గవర్నర్ తమిళ సై వ్యాఖ్యలు..

Republic Day: తెలంగాణ రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళ సై జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.

అయితే రాజ్ భవన్ లో నిర్వహించిన ఈ వేడుకలకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ప్రభుత్వం నుంచి పెద్దలు ఎవరూ హాజరు కాలేదు.

ఫ్రొటో కాల్ ప్రకారం ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులు మాత్రమే వేడుకలకు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్ధాయిలో మండి పడ్డారు.

 

కేసీఆర్ పై పరోక్ష వ్యాఖ్యలు (Republic Day).. 

‘రాజ్యంగం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ అభివ‌ృద్ధిలో నా పాత్ర తప్పక ఉంటుంది.

తెలంగాణ అంటే నాకు ఇష్టం. కొందరికి నేను నచ్చక పోవచ్చు.

ఎంతకష్టమైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తాను. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం.

అభివృద్ధి అంటే కొత్త భవనాల నిర్మించడం కాదు.. అభివృద్ది అంటే జాతి నిర్మాణం. కొందరికీ ఫార్మ్ హౌస్ కాదు.. అందరికీ ఫార్మ్ లు కావాలి.

తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి.’ అని పేర్కొన్నారు. ప్రసంగం సందర్భంగా గవర్నర్ తమిళ సై.. నా ప్రియమైన తెలంగాణ ప్రజలకు అంటూ తెలుగులో ప్రసంగించారు.

ఈ సందర్భంగా సమక్క.. సారాలమ్మ, కొమురం భీంలను స్మరించుకున్నారు.

ఎందరో వీరుల త్యాగ ఫలితం మన స్వాతంత్రం.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది అని గవర్నర్ అన్నారు.

తెలంగాణలో పెద్ద ఎత్తున హైవేలు నిర్మించిన ప్రధానికి గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు.

 

ప్రగతి భవన్‌లో రిపబ్లిక్ డే (Republic Day) వేడుకలు..

మరో వైపు ప్రగతి భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో పలువురు మంత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

అంతకు ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అమర వీరుల స్తూపం వద్ద కేసీఆర్ నివాళులు అర్పించారు.

దేశానికి వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

 

తీవ్రమైన వైరం.. కేంద్రం దృష్టికి తాజా పరిణామాలు

అయితే రాజభవన్ లో గణతంత్ర వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళ సై చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యారు.

కేసీఆర్ ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య గొడవ రోజురోజుకూ ఎక్కువవుతోంది.

తాజాగా గణతంత్ర వేడకలను పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించడంతో గవర్నర్ తమిళ సై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

రాజభవన్ లోనే వేడుకలను జరుపుకోవాలని ప్రభుత్వం లేకఖ రాయడంతో ఆమె అసహనానిక గురయ్యారని సమాచారం.

అనంతరం కోర్టు పిటిషన్ వేయడం.. గణతంత్ర వేడుకలు ఖచ్చితంగా జరపాలని కోర్టు ఆదేశించింది.

ఆఖరి నిమిషంలో పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయలేమని.. చివరకు రాజభవన్ లో నే పరేడ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిర్ణయించినట్టు సమాచారం.

రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి , గవర్నర్ తమిళ సై మధ్య దూరం గత రెండేళ్లుగా పెరుగుతూనే వస్తోంది.

తాజాగా బీజేపీ పై సీఎం కేసీఆర్ తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు.

అదే విధంగా బీజేపీ పాలనలో గవర్నర్ల వ్యవస్థ దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. దీంతో వైరం తీవ్రమైంది.

మరో వైపు గవర్నర్ తమిళ సై కూడా రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేస్తూ వచ్చారు.

ఈ క్రమంలో గణతంత్ర వేడుకలు మరోసారి ఇద్దరి మధ్య వివాదానికి తెర లేపాయి. గత ఏడాది కూడా రాజ్ భవన్ లోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు.

అదేవిధంగా ఈ సారి కూడా రాజ్ భవన్ లో నిర్వహించుకోవాలిన ప్రభుత్వం చెప్పడంతో గవర్నర్ అసంతృప్తి  వ్యక్తం చేశారు.

వేడుకల్లో గవర్నర్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనం.

అయితే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తమిళ సై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారని సమాచారం.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/