Home / తాజా వార్తలు
Mukesh Ambani Diwali Gift: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ ఐఫోన్ ప్రియులకు శుభవార్త అందించారు. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ సరికొత్త ఐఫోన్ 16 ను ఆకర్షణీయమైన ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని తీసుకొచ్చింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలతో పాటు, రిలయన్స్ డిజిటల్ కూడా కొత్త ఐఫోన్ 16 పై గొప్ప ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లు ఆపిల్కొత్త స్మార్ట్ఫోన్లను అద్భుతమైన ధరలకు కొనుగోలు […]
EV Offers: ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ కొనసాగుతోంది. సేల్‌లో అనేక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. వీటిని 50 శాతం వరకు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఇందులో గ్రీన్ ఉడాన్ ఎలక్ట్రిక్ స్కూటర్, EOX E1 ఎలక్ట్రిక్ స్కూటర్, Komaki X-ONE స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉన్నాయి. ఈ మోడళ్లన్నీ సులభ EMIలో బుక్ చేయవచ్చు. ఈ నేపథ్యంలో వీటిపై ఉన్న ఆఫర్లు, స్కూటర్ల ఫీచర్లు తదితర […]
Rajendra Prasads daughter passes away: టాలీవుడ్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించారు. రాత్రి ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా, రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే గాయత్రి ప్రేమ వివాహం చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చినట్లు తెలిసిందే. […]
Tata Diwali Offer: టాటా మోటర్స్ నవరాత్రి, దసరా ఉత్సవాల ఆనందాన్ని రెట్టింపు చేయనుంది. పండుగల సందర్భంగా టాటా లగ్జరీ ఎస్యూవీ హారియర్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. హారియర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 15.49 లక్షలు, కానీ ఇప్పుడు ఆఫర్లపై మీరు దీన్ని రూ. 14.99 లక్షలకు దక్కించుకోవచ్చు. ఈ SUV డీలర్ల నుండి రూ. 50 వేల విలువైన ప్రయోజనాలను పొందుతోంది. ఇది కార్పొరేట్తగ్గింపు కింద అందుబాటులో ఉంటుంది. హారియర్, సఫారిపై కంపెనీ ఇదే విధమైన […]
సింగరేణి కొలీరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్)కు ఒడిశాలో ఇటీవలకేటాయించిన నైని కోల్ బ్లాక్‌లో మిగిలిన పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో పంట రుణాల మాఫీని మూడు విడతల్లో ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు. బుధవారం ప్రజాభవన్‌లో జరిగిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సుమారుగా 60 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. నిరాశ్రయులకు షెల్టర్ జోన్ గా ఉన్న పాఠశాల, మరొక ప్రాంతంపై ఈ దాడులు జరిగాయి. కాగా, దాదాపు 10 నెలలుగా కొనసాగుతున్న వివాదంలో కాల్పుల విరమణ చర్చలు మరోసారి నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
: ఒమన్‌లోని ఇమామ్ అలీ మసీదు సమీపంలో జరిగిన కాల్పుల్లో ఒక భారతీయుడుతో సహా ఆరుగురు మరణించగా 28 మంది గాయపడ్డారు. జూలై 15న మస్కట్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడని, మరొకరు గాయపడ్డారని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే మరియు ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన “సబ్కా సాత్, సబ్కా వికాస్” నినాదం అవసరం లేదని, పార్టీ మైనారిటీ విభాగాన్ని తొలగించాలని అన్నారు.
కర్ఱాటకలోని ప్రైవేట్ పరిశ్రమలలో సి మరియు డి గ్రేడ్ పోస్టులకు కన్నడిగులు లేదా స్థానిక నివాసితులకు 100 శాతం రిజర్వేషన్లను తప్పనిసరి చేస్తూ కర్ణాటక మంత్రివర్గం ఆమోదించింది. అయితే, సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పరిశ్రమ దిగ్గజాల నుండి తీవ్ర విమర్శలు రావడంతో దానిని తొలగించారు