Home / తాజా వార్తలు
ప్రపంచం మొత్తం అధిక జనాభాతో సతమతమవుతోంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం తమ దేశం తల్లులను ఎక్కువ మంది పిల్లలను కనండి అని ప్రోత్సహిస్తున్నారు. రష్యాలో క్రమంగా శిశు జననాల రేటు తగ్గిపోవడంతో పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
సీఎం కేసీఆర్.. తెలంగాణాలో ఇన్నాళ్లూ తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. అయితే.. గంత కాలంగా రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. బీజేపీ క్రమంగా బలపడుతుండటంతో టీఆర్ఎస్లో సహజంగానే కలవరం మొదలైనట్లు తెలుస్తోంది.
కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణలో ఒక్కసారిగా న్యూస్‌మేకర్స్‌గా నిలిచారు. రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మునుగోడులో ఆయన నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ ఎంపీగా గెలిచినా కల్వకుంట్ల కవిత పసుపు రైతులను పట్టించుకోలేదని విమర్శలు వినిపించాయి.పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానన్న హామీ ఇచ్చి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు ధర్మపురి అరవింద్. పసుపు రైతులకు స్పైస్ బోర్డు ఏర్పాటు చేసిన అరవింద్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక టీఆర్ఎస్ సరికొత్త వ్యూహానికి తెరతీసింది. రైతులను ఎంపీపైకి ఉసిగొల్పడంతో దాడుల వరకు వెళ్లింది రాజకీయం.
ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామో ఘెబ్రేయేషన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఇప్పటి వరకు మంకీపాక్స్ 92 దేశాలకు విస్తరించగా, 35వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటన ఖరారైంది. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు మునుగోడులో జరగనున్న భారీ బహిరంగ సభకు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్ తెలిపారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని వాసవి గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. 40కి పైగా ఐటీ బృందాలు 20 ప్రాంతాల్లో జరుగుతున్న తనిఖీల్లో పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదలైన బండి సంజయ్ పాదయాత్ర 1000కిలో మీటర్లు పూర్తి చేసుకుంది.జనగామ జిల్లాలోని అప్పిరెడ్డిపల్లెలో బండి సంజయ్‌కి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర 1000కిలో మీటర్లు పూర్తైన సందర్భంగా సంజయ్ అప్పిరెడ్డిపల్లెలో పైలాన్ ఆవిష్కరించారు.
కొత్త సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ఆర్అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ లోని అన్ని విభాగాల పనులను అద్భుతంగా,
క్యాసినో కేసులో . ప్రధాని నిందితుడు చికోటి ప్రవీణ్ సంచలణ కామెంట్స్ చేశారు. తనను చంపేస్తానంటూ విదేశాల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పాడు. హిట్ మెన్ అనే యాప్‌లో సుపారి ఇచ్చామని.. త్వరలోనే నీ ప్రాణాలు పోతాయంటూ కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని చెప్పారు.