Home / తాజా వార్తలు
ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను, ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని తెలంగాణ గమనిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. నోవాటెల్ హోటల్ లో వీరిద్దరి భేటీ జరిగింది. ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. నోవాటెల్ హోటల్ లో దాదాపు 30 నిమిషాల పాటు వీరి భేటీ ఏకాంతంగా సాగింది.
నేడు మంగళగిరిలో జనసేన పార్టీ పీఏసీ సమావేశం జరుగనుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షత జరిగే సమావేశంలో జనసేన పార్టీ చేపట్టిన జనవాణి, కౌలు రైతు భరోసా యాత్ర, రోడ్ల దుస్థితిపై చేపట్టిన డిజిటల్ ప్రచారంపై సమీక్ష చేయనున్నారు.
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ గర్భవతి అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ముంబైలోని డెంటల్ క్లినిక్ బయట కత్రినా మరియు భర్త విక్కీ కౌశల్ కనిపించారు. ఇది రెగ్యులర్ డెంటల్ చెక్-అప్. అయితే, ఆమె ఫోటోలు ప్రెగ్నెంట్ అయిందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
దర్శకుడు సుకుమార్‌తో గతంలో విజయ్ దేవరకొండ ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు సెట్స్ పైకి రాలేకపోయింది.విజయ్ తన ప్రాజెక్ట్స్ లైగర్, కుషి మరియు జన గణ మనతో బిజీగా ఉండగా, సుకుమార్ తన చిత్రం పుష్ప 2 కోసం పని చేస్తున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని మధురలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భారీ రద్దీ కారణంగా ఊపిరాడక ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాంకే బీహారీ ఆలయంలో అర్థరాత్రి వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.
లండన్‌లో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. బ్రిటిష్ రాజధాని లండన్‌లో శుక్రవారం నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగారు. అండర్‌గ్రౌండ్ రైల్వే సర్వీసుతో పాటు ఓవర్ గ్రౌండ్ రైల్వే సర్వీసులు దాదాపు నిలిచిపోయాయి.
మందు తాగండోయ్ బాబు. మందు తాగండోయ్ అంటూ యువతను బతిమాలుకుంటోంది జపాన్ ప్రభుత్వం. సడెన్‌గా జపాన్ యువత బుద్ది మంతులయ్యారు. మందుకు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూకు గండిపడింది.
కరోనాకు పుట్టినిల్లు చైనా. ప్రపంచమంతా ప్రజలు కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే చైనాను కరోనా ఇంకా వదల్లేదు. ఇప్పటికి చైనీయులు వణికిపోతూనే ఉన్నారు. జీరో టాలరెన్స్‌తో కరోనాను అదుపు చేస్తున్నారు.
తాను భారత సైన్యంలో చేరాలనుకున్నానని, అయితే కుటుంబ కారణాల వల్ల కుదరలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అస్సాం రైఫిల్స్ మరియు భారత సైన్యంలోని 57వ మౌంటైన్ డివిజన్ సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ నేను కూడా సైన్యంలో చేరాలని కోరుకున్నాను.