Last Updated:

CM KCR: కొత్త స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను పరిశీలించిన సీఎం కేసీఆర్

కొత్త స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను సీఎం కేసీఆర్ ప‌రిశీలించారు. నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ఆర్అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ లోని అన్ని విభాగాల పనులను అద్భుతంగా,

CM KCR: కొత్త స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను  పరిశీలించిన సీఎం కేసీఆర్

Hyderabad: కొత్త స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను సీఎం కేసీఆర్ ప‌రిశీలించారు. నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ఆర్అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ లోని అన్ని విభాగాల పనులను అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. సెక్రటేరియట్ లో జరుగుతున్న నిర్మాణాలన్నింటినీ ముఖ్యమంత్రి కలియతిరుగుతూ నిశితంగా పరిశీలించారు. తొలుత నిర్దేశించుకున్న డిజైన్ల ప్రకారం పనులు జరుగుతున్నాయా అని మంత్రిని, అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఏకకాలంలో అన్ని పనులు వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కావద్దని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. స్లాబుల నిర్మాణం, భవనం పైన డూమ్స్ ఏర్పాటు, ఇంటీరియర్ పనులతోపాటు ఫర్నీచర్ విషయంలో నూతన మోడల్స్ ఎంపిక చేసుకోవాలని సీఎం సూచించారు. మంత్రుల ఛాంబర్లు, మీటింగ్ హాల్స్, యాంటీ రూమ్స్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భవనం మధ్య భాగంలో సుమారు 2 ఎకరాల ఖాళీ స్థలంతోపాటు, సెక్రటేరియట్ ప్రాంగణంలో గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ పనులు అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. గ్రిల్స్ నిర్మాణ పనుల నాణ్యత గురించి సీఎం ఆరా తీశారు.

కొత్త సచివాలయంలో రెడ్ స్టోన్, డ్రైనేజీ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. విజిటర్స్ లాంజ్ నిర్మాణ పనులను, సెక్రటేరియట్ వాల్ వెంబడి మట్టి ఫిల్లింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సెక్రటేరియట్ కు వచ్చే విదేశీ ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సందర్శకులకు సౌకర్యవంతంగా ఉండేలా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ జిల్లాల నుండి సెక్రటేరియట్ కు వచ్చే ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలకు సౌకర్యంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. పనులకు సంబంధించిన ఆల్బమ్ ను పరిశీలిస్తూ, ఒక్కో పని గురించి సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్

ఇవి కూడా చదవండి: