Home / తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఈనెల 26 నుంచి దసరా ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. పది రోజులపాటు జరిగే ఉత్సవాలలో వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
సంజూ శాంసన్ అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టీమ్ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్‌ను భారత్ ఏ జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించింది. న్యూజిలాండ్-ఏతో ఇండియాలో జరిగే మూడు వన్డేల సిరీసులకు భారత సెలక్టర్లు జట్టును ప్రకటించారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తుంది. దానిలో భాగంగా నేడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.
నేటి బంగారం ధరలు ప్రధాన నగరాలైనా హైద్రాబాద్,విజయవాడ,విశాఖపట్టణం,డిల్లీలో కింద ఇచ్చిన విధంగా ఉన్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూకుడు పెంచారు. ఈ సారి 175 సీట్లకు 175 గెలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. 2024 లో జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రీపెర్ అవుతున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మరి ఆహారం, ఎరువుల కొరత, ఇంధన భద్రత సమస్యల పరిష్కారం ముఖ్యమని, నేటి యుగం యుద్ధ యుగం కాదని ప్రధాని మోదీ రష్యా అద్యక్షుడు పుతిన్ తో అన్నారు. ఉబెకిస్తాన్ లోని సమర్కండ్ లో జరిగిన షాంగై సహకార సంస్ధ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్లా జిల్లాలో చోటుచేసుకొన్న ఓ ఘటన పోలీసుల పనితీరుకు అద్దం పడుతుంది. స్వయానా మంత్రి స్టేజీపైకి ఓ యువకుడు దూసుకెళ్లిన ఘటనపై పలువరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపటిదినం సెలవుదినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
జపనీస్ స్టార్టప్ AERWINS టెక్నాలజీస్ తయారు చేసిన ఫ్లయింగ్ బైక్ గురువారం డెట్రాయిట్ ఆటో షోలో యునైటెడ్ స్టేట్స్లో ప్రారంభమైంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే బైక్‌గా పేర్కొనబడిన హోవర్‌బైక్ ప్రముఖ స్టార్ వార్స్ బైక్‌ల పోలికలను కలిగి ఉంది.
ఢిల్లీలోని ఒక నైజీరియన్ మహిళకు మంకీ ఫాక్స్ పాజిటీవ్ గా నిర్దారణ కావడంతో భారత్ లో కేసులసంఖ్య 13కి చేరుకుంది. మంకీపాక్స్‌తో బాధపడుతున్న మరో వ్యక్తి కూడా ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.