Sanju Samson: బీసీసీఐ దిద్దుబాటు చర్య.. సంజూకు కెప్టెన్సీ పగ్గాలు..!
సంజూ శాంసన్ అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టీమ్‌ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్‌ను భారత్ ఏ జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించింది. న్యూజిలాండ్-ఏతో ఇండియాలో జరిగే మూడు వన్డేల సిరీసులకు భారత సెలక్టర్లు జట్టును ప్రకటించారు.
Mumbai: సంజూ శాంసన్ అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టీమ్‌ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్‌ను భారత్ ఏ జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించింది. న్యూజిలాండ్-ఏతో ఇండియాలో జరిగే మూడు వన్డేల సిరీసులకు భారత సెలక్టర్లు జట్టును ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి ఈ సిరీస్ మొదలు కానుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా 22,25,27న మ్యాచులు జరుగనున్నాయి.
టీ20 ప్రపంచ కప్పులోనూ మరియు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరిగిన మ్యాచుల్లోనూ సంజూ శాంసన్ కు చోటు కల్పించకపోవడం విధితమే. కాగా ఈ క్రమంలో సంజూ అభిమానులు బీసీసీఐ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదీ కాకా సంజూతో పోల్చితే రిషబ్ పంత్ అసలు ఏమాత్రం క్రికెట్ అభిమానులను తన ఆటతీరుతో ఆకట్టుకోలేక పోయారు. కానీ పంత్ కు టీ20 ప్రపంచకప్ జట్టులో ప్లేస్ కల్పించడం పట్ల సంజూ అభిమానులు ఆక్రోషం వ్యక్తం చేశారు. ఆనాటి నుంచి సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారాన్ని ట్రెండింగ్ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే తిరువనంతపురంలో భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచు జరిగేటప్పుడు బీసీసీఐకు వ్యతిరేకంగా భారీ నిరసనలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనే సమాచారం ఉంది. ఈ మేరకు బీసీసీఐ తాజాగా ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అంటున్నారు.
భారత్ ఏ జట్టులో ఎవరెవరంటే: పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, రజత్ పాటిదార్, సంజు శాంసన్ (కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), కుల్‌దీప్ యాదవ్, షాబాజ్ అహ్మద్, రాహుల్ చాహర్, తిలక్ వర్మ, కుల్దీప్ సేన్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, నవదీప్ సైని, రాజ్ అంగద్ బవాగాలను జట్టుగా బీసీసీఐ ప్రకటించింది.
ఇదీ చదవండి: ఇండియా వర్సెస్ పాకిస్థాన్… టికెట్స్ ఫుల్