Last Updated:

Virat Kohli: ‘ఫెయిల్యూర్‌ కెప్టెన్‌’ గా ముద్ర వేశారు.. విరాట్ కోహ్లీ ఆవేదన

Virat Kohli: టీమిండియా జట్టుకు కెప్టెన్ గా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు కోహ్లీ. ఓడిపోయే మ్యాచ్ లను సైతం ఒంటిచేత్తో గెలిపించి టీమిండియాకు మరపురాని విజయాలను అందించాడు. కానీ ఐసీసీ టైటిల్ సాధించడంలో కోహ్లీ ఇప్పటి వరకు విజయం సాధించలేకపోయాడు.

Virat Kohli: ‘ఫెయిల్యూర్‌ కెప్టెన్‌’ గా ముద్ర వేశారు.. విరాట్ కోహ్లీ ఆవేదన

Virat Kohli: భారత జట్టుకు విరాట్ కోహ్లీ ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. ఓ దశలో టీమిండియా జట్టుకు అత్యుత్తమ కెప్టెన్ గా సేవలందించాడు. కానీ ఐసీసీ ఈవెంట్లలో కోహ్లీని దురదృష్టం వెంటాడింది. రన్ మెషీన్ కోహ్లీ సారథ్యంలో భారత్ ఒక్కసారిగా కూడా.. ఐసీసీ ఈవెంట్లలో విజేతగా నిలవలేదు. దీంతో కోహ్లీ పై ఫెయిల్యూర్ కెప్టెన్ గా ముద్రవేశారు. తాజాగా ఈ అంశంపై కోహ్లీ స్పందించాడు.

ఎన్నో విజయాలు అందించిన విరాట్.. (Virat Kohli)

టీమిండియా జట్టుకు కెప్టెన్ గా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు కోహ్లీ. ఓడిపోయే మ్యాచ్ లను సైతం ఒంటిచేత్తో గెలిపించి టీమిండియాకు మరపురాని విజయాలను అందించాడు. కానీ ఐసీసీ టైటిల్ సాధించడంలో కోహ్లీ ఇప్పటి వరకు విజయం సాధించలేకపోయాడు. దీంతో అతడిని క్రికెట్ విశ్లేషకులు ఫెయిల్యూర్ కెప్టెన్ గా ముద్ర వేశారు. దీంతో ఈ అంశంపై కోహ్లీ స్పందించాడు. కోహ్లి సారథ్యంలో 2017 లో ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ పై భారత్ ఫైనల్లో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ లో ఓటమి.. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్-2021 ఫైనల్లో కీవిస్ చేతిలో ఓటమిపాలేంది. దీంతో కోహ్లీ ఫెయిల్యూర్ కెప్టెన్ గా చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

విమర్శలను పట్టించుకోలేదు..

ఫెయిల్యూర్ కెప్టెన్ గా తనపై వచ్చిన విమర్శలను తాను పట్టించుకోలేదని కోహ్లీ అన్నాడు. ఆర్సీబీ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కోహ్లీ.. తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ప్రతీ కెప్టెన్‌ తన జట్టుకు ఐసీసీ టైటిల్‌ ను అందించాలని అనుకుంటాడు.. దానికి తగిన విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తాడు. 2017, 2019 వన్డే ప్రపంచకప్ లో జట్టుకు టైటిల్‌ అందించేందుకు వందశాతం కృషి చేశాను అయినప్పటికి నన్ను ఒక ఫెయిల్యూర్ కెప్టెన్ గా ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. నాలుగు ఐసీసీ టోర్నమెంట్ల తర్వాత ఇలా ముద్ర వేయడం సరికాదని అన్నాడు. ఐసీసీ టోర్నమెంట్లలో కాకుండా.. మిగతా సందర్భాల్లో జట్టుకు అనేక విజయాలు అందించినట్లు కోహ్లీ తెలిపాడు. కెప్టెన్ గా ఉన్న సమయంలో.. జట్టులో వచ్చిన పెనుమార్పులు నాకు గర్వకారణం అంటూ కోహ్లి చెప్పుకొచ్చాడు. ఆటగాడిగా ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాను. ఈ కోణలో చూడకండూ.. ఫెయిల్యూర్ కెప్టెన్ గా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించాడు. విమర్శలకు తాను ఎప్పుడు బాధపడలేదని.. ఆట గురించే ఆలోచించేవాడినని కోహ్లీ అన్నాడు. ఇప్పటికి కొంతమంది క్రికెటర్లు.. ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో కూడా లేరు. వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోండి అంటూ పేర్కొన్నాడు.