Ilayaraja: గుడిలో అవమానం – స్పందించిన ఇళయరాజా, ఏమన్నారంటే..
Ilayaraja About Temple Incident: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు ఓ గుడిలో అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా గుడి సంఘటనపై ఆయన స్పందించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. కాగా సోమవారం నుంచి మార్గశిర మాసం మొదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలోని ఆండాళ్, రంగమన్నారన్‌ను దర్శించుకున్నారు.
ఈ క్రమంలో ఆయన గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండపం లోపలికి వెళ్లేందుకు యత్నించగా అక్కడే ఉన్న జీయర్ ఆయనను అడ్డుకున్నారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంలో ఆలయ సిబ్బంది తీరుపై అభ్యంతరకం వ్యక్తం చేశారు. సంగీత విద్వాంసుడైన దేవాలయానికి దర్శనానికి వెళ్లారు. అయితే అక్కడ గర్భగుడిలోకి దర్శనానికి ఇళయరాజాను అక్కడ ఉన్న జీయర్ అడ్డుకున్నారు. దీంతో ఆయన బయటే పూజ చేయించుకుని వెళ్లిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోపై ఆయన అభిమానులు స్పందిస్తూ ఆలయ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగీతంలో ఎనలేని సేవలు అందించిన ఈ మ్యూజిక్ మ్యాస్ట్రోకి దక్కింది ఇలాంటి గౌరవమా? తన పాటలతో స్వామిని కీర్తించిన ఈ సంగిత విద్యాంసుడి ఇంతటి అవమానమా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అంతేకాదు దీనిపై నెట్టింట తెగ చర్చ కూడా జరిగింది. ఇది కాస్తా ఇళయరాజా దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. తనపై జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారంపై ఆయన అసహన వ్యక్తంచేశారు.
என்னை மையமாக வைத்து சிலர் பொய்யான வதந்திகளைப் பரப்பி வருகிறார்கள். நான் எந்த நேரத்திலும், எந்த இடத்திலும் என்னுடைய சுய மரியாதையை விட்டுக் கொடுப்பவன் அல்ல, விட்டுக்கொடுக்கவும் இல்லை. நடக்காத செய்தியை நடந்ததாகப் பரப்புகின்றார்கள். இந்த வதந்திகளை ரசிகர்களும், மக்களும் நம்ப வேண்டாம்.
— Ilaiyaraaja (@ilaiyaraaja) December 16, 2024
“కొంతమంది నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను నా ఆత్మగౌరవం విషయంలో ఎక్కడా, ఏ సమయంలో కూడా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిని కాదు. అసలు అక్కడ ఏం జరగకపోయినా జరిగినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఈ వదంతులను అభిమానులు, ప్రజలు నమ్మొద్దుశ” అంటూ వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చారు. కాగా సోమవారం శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీ ఆండాళ్ జీయర్ మఠానికి చెందిన సడగోప రామానుజ అయ్యర్, సడగోప రామానుజ జీయర్‌లతో కలిసి ఇళయరాజా పూజలో పాల్గొన్నారు. అలాగే ఈ శుభ సందర్భంగా ఇళయరాజా స్వరపరిచిన ‘దివ్య పాసురం’ని విడుదల చేయడానికి ఆలయానికి వెళ్లారని తెలుస్తోంది.