Buggana Rajendranath Reddy: ఫైనాన్స్ మినిస్టర్ అప్పు చెయ్యకపోతే ఎవరు చేస్తారు.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
ఫైనాన్స్ మినిస్టర్ అప్పు చెయ్యకపోతే ఎవరు చేస్తారు ? హోమ్ మంత్రి చేస్తారా అంటూ ఏపీ ఆర్దికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో చేసిన విమర్శల పై ఆయన స్పందించారు.
Andhra Pradesh: ఫైనాన్స్ మినిస్టర్ అప్పు చెయ్యకపోతే ఎవరు చేస్తారు? హోమ్ మంత్రి చేస్తారా అంటూ ఏపీ ఆర్దికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో చేసిన విమర్శల పై ఆయన స్పందించారు. అప్పు ఎవరు చెయ్యలేదు. మీరు ఎంత చేశారు? యనమల పెద్ద అప్పుల మంత్రి అంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటా అని చంద్రబాబు చెబుతున్నారు.గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటా అంటే ఎవర్ని బెదిరిస్తారు? అంటూ బుగ్గన అడిగారు.
చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రజల్లో ఏమి మాట్లాడినా నడుస్తుంది అనే ఆహకారంతో చంద్రబాబు ఉన్నారని ఆయన విమర్శించారు. 2014 లో ఇంటికి ఒక ఉద్యోగం అని బాబు చెప్పారు. కర్నూలు లో ఎన్ని పరిశ్రమలు ఇచ్చారో చంద్రబాబు ఆలోచించుకోవాలి. సోలార్ విండ్ పవర్ లో పెద్ద ప్రాజెక్ట్ ఈ ప్రభుత్వం లో జరుగుతోంది. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఈ ప్రభుత్వంలో వచ్చింది. కోవిడ్ ఉన్నా కూడా 13 వేల 200 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. 2014 లో ఇంటికి ఒక ఉద్యోగం అని బాబు చెప్పారు. కర్నూల్ లో ఎన్ని పరిశ్రమలు ఇచ్చారో చంద్రబాబు ఆలోచించుకోవాలని అన్నారు.
అసలు రాయలసీమ కు చంద్రబాబు ఏమి చేశారు? రాయలసీమ ప్రజలు విజ్ఞులు కాబట్టి బాబు పర్యటన ను అడ్డుకోలేదు. రాయలసీమ వెనకబడ్డ ప్రాంతం కాబట్టి హై కోర్ట్ ఉండాలంటే వద్దంటారు. మూడు రాజధానులుకు ఎందుకు వ్యతిరేకం? రాయలసీమ ఏమి పాపం చేసింది కోర్ట్ ను కూడా అడ్డుకుంటున్నారని మంత్రి బుగ్గన విరుచుకుపడ్డారు.