Sameer Sharma is Serious : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు తీవ్ర అస్వస్థత..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో బ్యాంకు అధికారులతో సమీక్ష చేస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. సమీక్ష జరుపుతూనే సమీర్ శర్మ కుర్చీలో నుంచి ఒరిగిపోయారు.
Sameer Sharma: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో బ్యాంకు అధికారులతో సమీక్ష చేస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. సమీక్ష జరుపుతూనే సమీర్ శర్మ కుర్చీలో నుంచి ఒరిగిపోయారు. దీంతో ఆందోళనకు గురైన అధికారులు ఆయనను అత్యవసరంగా అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.దీంతో సచివాలయంలోని అధికారులు సీఎస్ సమీర్ శర్మను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
సమీర్ శర్మ గత నెలలో కూడా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో సమీర్ శర్మకు గుండె సంబంధిత చికిత్స జరిగింది. ఈ సమయంలో ఆయన స్థానంలో ఏపీ ఇంచార్జీ సీఎస్ గా విజయానంద్ ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి విధుల్లో చేరిన కొద్దిరోజులకే సమీర్ శర్మ మరోసారి అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.