China: చైనా అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఎన్నికైన జిన్ పింగ్
షీజిన్‌పింగ్ వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడు, పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియా సమావేశంలో తెలిపారు.
China: షీజిన్‌పింగ్ వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడు, పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియా సమావేశంలో తెలిపారు.
ఇకపోతే దేశానికి సరికొత్త ప్రీమియర్ (ప్రధాని)ను కూడా ఎన్నుకొన్నారు. షాంఘైలో జరిగిన పార్టీ సమావేశం నిర్వహించారు. దీనిలో చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేసిన లీ కియాంగ్‌ను దేశ ప్రధానిగా ఎంపిక చేశారు. షీ జిన్‌పింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కియాంగ్ పేరును ప్రకటించారు. దానిపాటు పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ కొత్త సభ్యల పేర్లను కూడా జిన్ పింగ్ వెల్లడించారు. ఈ స్టాండింగ్ కమిటీలో షీ జిన్‌పింగ్, లీ కియాంగ్‌తోపాటు ఝావో లిజి, వాంగ్ హునింగ్, కాయి కి, డింగ్ షూషాంగ్, లీషీకు స్థానం కల్పించారు.
ఇదీ చదవండి: 45 రోజులే పదవి.. కానీ లిజ్ ట్రస్ కు ఏడాదికి కోటిరూపాయల భత్యం