Last Updated:

Congo: కాంగోలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 37 మంది మృతి.

రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాజధాని బ్రజ్జావిల్లేలోని స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సందర్భంగా రాత్రి జరిగిన తొక్కిసలాటలో 37 మంది యువకులు మరణించారని అధికారులు మంగళవారం తెలిపారు.గత వారం సైన్యం 18 మరియు 25 సంవత్సరాల మధ్య వయస్సు గల 1,500 మందిని రిక్రూట్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Congo: కాంగోలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 37 మంది  మృతి.

Congo: రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాజధాని బ్రజ్జావిల్లేలోని స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సందర్భంగా రాత్రి జరిగిన తొక్కిసలాటలో 37 మంది యువకులు మరణించారని అధికారులు మంగళవారం తెలిపారు.గత వారం సైన్యం 18 మరియు 25 సంవత్సరాల మధ్య వయస్సు గల 1,500 మందిని రిక్రూట్ చేస్తున్నట్లు ప్రకటించింది.

గేట్లు ఎక్కి వెళ్లడంతోనే..(Congo)

ఇలా ఉండగా తొక్కిసలాట లో పెద్ద సంఖ్యలో పలువురు గాయపడ్డారని కూడా ప్రధాన మంత్రి అనటోల్ కొల్లినెట్ మకోసో చెప్పారు.ప్రధానమంత్రి అధ్వర్యంలో సంక్షోభ విభాగం ఏర్పాటు చేయబడిందని ఒక ప్రకటనలో తెలిపారు. బ్రెజ్జావిల్లే నడిబొడ్డున ఉన్న మిచెల్ డి’ఓర్నానో స్టేడియానికి వెళ్లాల్సిందిగా రిక్రూట్‌ చేయబడిన వారికి సూచించారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొంతమంది వ్యక్తులు గేట్లు ఎక్కి బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో అది పెనుగులాటకు దారితీసి పలువురి మరణాలకు కారణమయింది.