Home / అంతర్జాతీయం
:పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ప్రభుత్వ సంస్థలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు' చేసిన కొన్ని గంటల తర్వాత తక్షణమే అతని ప్రసంగాలను పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా వాచ్డాగ్ ఆదివారం నిషేధించింది.
:రష్యా సైనికులు చేసిన 171 లైంగిక హింస కేసులపై ఆ దేశ ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తు జరుపుతోందని ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కా తెలిపారు. లైంగిక హింస మరియు యుద్ధ నేరాలపై ప్యానెల్ చర్చను ఉద్దేశించి జెలెన్స్కా మాట్లాడుతూ, పైన పేర్కొన్న గణాంకాలు అధికారికంగా ఉన్నాయని అన్నారు.
ఇంగ్లిష్ ఛానల్ మీదుగా యూరప్ నుండి చిన్న పడవలలో బ్రిటన్‌కు చేరుకునే వలసదారులపై కఠినంగా వ్యవహరించడానికి యునైటెడ్ కింగ్డమ్ కొత్త చట్టాన్ని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. నివేదికల ప్రకారం చట్టం మంగళవారం ఆవిష్కరించబడుతుంది.
: ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్న చైనా ఈ ఏడాది రక్షణ బడ్జెట్‌ను 7.2 శాతంపెంచనున్నట్లు ప్రకటించింది.ఆదివారం ఉదయం విడుదల చేసిన ముసాయిదా బడ్జెట్ నివేదికలో, అధ్యక్షుడు జి జిన్‌పింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం దాదాపు 1.55 ట్రిలియన్ యువాన్లు ($224 బిలియన్లు) ఖర్చు చేయనున్నట్లు అంచనా వేయబడింది.
చైనాలో మొదలై ప్రపంచాన్ని వణికించింది కరోనా మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. అక్కడక్కడ ఇంకా కేసులు ఉన్నా వైరస్ అదుపులోనే ఉంది.
సౌదీ అరేబియా త్వరలో దేశంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలలో యోగాను ప్రవేశపెట్టనుంది. సౌదీ యోగా కమిటీ (SYC) అధ్యక్షుడు నౌఫ్ అల్-మార్వాయ్ చెప్పిన దాని ప్రకారం యోగాకు మద్దతు ఇవ్వడానికి మరియు ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేయబడతాయి.
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III మరియు క్వీన్ కెమిల్లా పట్టాభిషేకం నూనెను జెరూసలెంలో పవిత్రం చేసినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ శుక్రవారం ధృవీకరించింది. మే 6 న 74 ఏళ్ల రాజు మరియు 75 ఏళ్ల రాణిని అభిషేకం చేయడానికి ఉపయోగించే నూనెను శుక్రవారం ఉదయం జెరూసలెంలోని చర్చి ఆఫ్ ది హోలీ సెపల్చర్ వద్ద పవిత్రంగా ఉంచాని ప్యాలెస్ వెల్లడించింది.
రష్యన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ స్పుత్నిక్ V ను రూపొందించడానికి సహాయపడిన శాస్త్రవేత్తలలో ఒకరైన ఆండ్రీ బొటికోవ్,అతని అపార్ట్ మెంట్లో బెల్టుతో గొంతు కోసి చంపబడ్డాడు. హత్యకు సంబంధించి పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
: యునైటెడ్ స్టేట్స్ శుక్రవారం ఉక్రెయిన్ కు 400 మిలియన్ డాలర్ల సైనిక సహాయ ప్యాకేజీని ప్రకటించింది. వాటిలో మందుగుండు సామగ్రితో పాటు ట్యాంకులు, మిలిటరీ వాహనాలు ఉన్నాయి.
ఇండోనేషియాలో శుక్రవారం నాడు చమురు డిపోలో మంటలంటుకొని సుమారు 17 మంది దుర్మరణం పాలయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. డిపోకు చుట్టుపక్కల నివాసం ఉంటున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు