Home / అంతర్జాతీయం
సౌదీ అరేబియాతో దౌత్య సంబంధాలను పునఃప్రారంభించేందుకు, ఇరు దేశాల్లో తమ రాయబార కార్యాలయాలను తిరిగి తెరవడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. ఏడేళ్ల ఉద్రిక్తతల తర్వాత, చైనా సహాయంతో ఇరు దేశాలు ఎట్టకేలకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ ఇన్నోవేషన్ శుక్రవారం సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను మూసివేసింది, అందుబాటులో ఉన్న నగదు తక్కువగా ఉన్నందున ఖాతాదారులను తమ డబ్బును తీసుకోవద్దని చెప్పిన రెండురోజులకే ఇది జరిగింది.
చాట్ జీపీటీ.. ఇప్పుడు ప్రపంచమంతా ప్రధానంగా దీని గురించే మాట్లాడుకుంటోంది. చాట్ జీపీటీ వచ్చినప్పటి నుంచి సరికొత్త సంచలనమే అని చెప్పుకోవచ్చు.
ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంగా గుర్తింపు తెచ్చుకున్న చైనా సాయుధ దళాలకు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధిష్ఠానమైన కేంద్ర మిలిటరీ కమిషన్ ఛైర్మన్ గా కూడా జిన్‌పింగ్‌నే ఎన్నుకుంటూ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ తీర్మానం చేసింది.
నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామ్ చంద్ర పాడెల్ ఎన్నికయ్యారు. అతను 33 వేల 8 వందల 2 ఎలక్టోరల్ ఓట్లను సాధించగా, అతని ప్రత్యర్థి సుభాష్ చంద్ర నెంబ్వాంగ్ కు 15 వేల 5 వందల 18 ఎలక్టోరల్ ఓట్లు వచ్చినట్లు నేపాల్ ఎన్నికల సంఘం తెలిపింది.
తూర్పుకాంగోలో మిత్రరాజ్యాల డెమోక్రటిక్ ఫోర్సెస్ మిలిటెంట్లు జరిపినజంట దాడుల్లో 40 మందికి పైగా పౌరులు హతమయ్యారని స్థానిక అధికారులు గురువారం తెలిపారు.
:చైనీస్ దౌత్యవేత్తలు తమ దేశాన్ని రక్షించుకోవడానికి తోడేళ్ళతో డ్యాన్స్ చేయాలంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ వ్యాఖ్యానించారు. తన తొలి వార్షిక మీడియా సమావేశంలో విదేశాంగ విధానం మరియు యుఎస్-చైనా సంబంధాల గురించి ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
లాట్వియా ఈ సంవత్సరం బాగా తాగి నడిపిన డ్రైవర్ల నుండి కార్లను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ఇలా స్వాధీనం చేసుకున్నవందలాది వాహనాలతో స్దలాలు నిండిపోవడంతో వాటిని ఉక్రేనియన్ మిలిటరీ మరియు ఆసుపత్రులకు పంపాలని నిర్ణయించుకుంది.
భారీ వర్షాలు, మంచు కరగడం వల్ల వరదల ముప్పు భారీగా పొంచి ఉంది. అవి లోతట్టు ప్రాంతాలకు తీవ్ర ప్రమాదంగా మారతాయి
ఇండోనేషియా తన రాజధానిని జకార్తా నుంచి బోర్నియోకు తరలిస్తోంది. 2045 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో ఉన్న ఇండోనేషియా తన కొత్త రాజధాని పర్యావరణ హితంగా ఉంటుందని పేర్కొంది. అంతేకాదు ఇది అటవీనగరంగా ఉంటుందని తెలిపింది.