Home / అంతర్జాతీయం
మార్చి 17న ఒక పత్రికా ప్రకటనలో, రోల్స్ రాయిస్ మరియు యూకే స్పేస్ ఏజెన్సీ మైక్రో-రియాక్టర్ ప్రోగ్రామ్ చంద్రునిపై నివసించడానికి మరియు పని చేయడానికి మానవులకు అవసరమైన శక్తిని అందించే సాంకేతికతను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుందని తెలిపారు.
లండన్ లోని భారత హైకమిషన్ వద్ద ఆదివారం కిటికీని పగులగొట్టడంతో లండన్ పోలీసులు ఆదివారం ఒక వ్యక్తిని అరెస్టు చేసారు. ఈ సందర్బంగా ఇద్దరు సెక్యూరిటీ గార్డులకు స్వల్ప గాయాలయ్యాయి.సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన వీడియోలో, లండన్‌లోని భారత హైకమిషన్‌లోని ఒక అధికారి ఖలిస్తానీ మద్దతుదారుడి నుండి త్రివర్ణ పతాకాన్ని రక్షించడం మరియు ఖలిస్తానీ జెండాను విసిరేయడం కనిపించింది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)ని "నిషిద్ధ" సంస్థగా ప్రకటించాలని భావిస్తున్నట్లు పాకిస్తాన్ అంతర్గత మంత్రి రానా సనువల్లా చెప్పారు. దీనికోసం ప్రభుత్వం నిపుణులను సంప్రదిస్తుందని ఆయన పేర్కొన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవిలో ఉన్నప్పుడు విదేశీ బహుమతులు మరియు అలంకారాల చట్టం ప్రకారం విదేశీ ప్రభుత్వ అధికారుల నుండి అందుకున్న బహుమతులను బహిర్గతం చేయడంలో విఫలమయ్యారని యుఎస్ హౌస్ డెమోక్రాట్ల నివేదిక తెలిపింది.
ఆస్ట్రేలియాలోని మెనిండీలో మిలియన్ల కొద్దీ చనిపోయిన మరియు కుళ్ళిన చేపలు తీరానికి కొట్టుకు వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.న్యూ సౌత్ వేల్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రైమరీ ఇండస్ట్రీస్ ప్రకారం, వరదనీరు తగ్గుముఖం పట్టినప్పుడు ప్రాణవాయువు తక్కువగా ఉండటం వల్ల మరణాలు సంభవించి ఉండవచ్చు.
బంగ్లాదేశ్‌లోని మదారిపూర్‌లోని షిబ్‌చార్ ఉపజిల్లాలోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో ఢాకాకు వెళ్తున్న బస్సు పద్మ వంతెన వద్దకు వెళ్లే రహదారిపై నుండి ఒక కాలువలోకి దూసుకెళ్లడంతో కనీసం 17మంది మరణించగా 30 మంది గాయపడ్డారు.
శనివారం దక్షిణ ఈక్వెడార్ మరియు ఉత్తర పెరూలో సంభవించిన బలమైన భూకంపంతో 15 మంది మృతి చెందగా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ఈక్వెడార్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన గ్వాయాక్విల్కు దక్షిణంగా 50 మైళ్ల (80 కిలోమీటర్లు) దూరంలో పసిఫిక్ తీరంలో కేంద్రీకృతమై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నివేదించింది.
ఈ క్రమంలోనే ‘ఐయామ్ బ్యాక్’ అంటూ ఫేస్బుక్, యూట్యూబ్‌లో శుక్రవారం ట్రంప్ పోస్ట్ చేశారు.
:నగదు కొరతతో ఉన్న పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి ( ఐఎంఎఫ్) నుండి బెయిలౌట్ పొందడానికి కష్టపడుతో్ంది. ఈ నేపధ్యంలో ఐఎంఎఫ్ ముందుకు తెచ్చిన కొత్త షరతులు పాకిస్తాన్‌కు రుణ ఒప్పందాన్ని పొందడం మరింత కష్టతరం చేసే అవకాశం ఉంది.
వీడియో షేరింగ్ చైనీస్ యాప్ టిక్ టాక్ ని నిషేధించిన దేశాల జాబితాలో న్యూజిలాండ్ చేరింది. మార్చి చివరి నాటికి నెట్‌వర్క్‌కు యాక్సెస్ ఉన్న అన్ని పరికరాల్లో యాప్ నిషేధించబడుతుంది.