Home / అంతర్జాతీయం
యునైటెడ్ స్టేట్స్ డిసెంబర్లో కొన్ని వర్గాల H-1B వీసాలను దేశంలోనే రెన్యువల్ చేసుకునే పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. దీనిద్వారా స్వదేశాలకు వెళ్లకుండా ఎన్నారైలు తమ వీసాలను రెన్యువల్ చేసుకోవచ్చు. ఇది గణనీయమైన సంఖ్యలో భారతీయ సాంకేతిక నిపుణులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
దక్షిణాఫ్రికాలోని ప్లాటినం గనిలో కార్మికులను తీసుకెళ్తుండగా ఒక ఎలివేటర్ అకస్మాత్తుగా 200 మీటర్లు (656 అడుగులు) కిందకు పడిపోవడంతో 11 మంది మృతి చెందగా, 75 మంది గాయపడ్డారని గని ఆపరేటర్ మంగళవారం తెలిపారు.ఉత్తర నగరంలోని రస్టెన్‌బర్గ్‌లోని గనిలో కార్మికుల షిఫ్ట్ ముగింపులో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు.
ఉత్తర కొరియా తన మొదటి గూఢచారి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపినట్లు పేర్కొంది, ఇది గత వారం కక్ష్యలోకి ప్రవేశపెట్టబడింది. ఈ ఉపగ్రహం వైట్ హౌస్, పెంటగాన్ మరియు సమీపంలోని యుఎస్ నావికాదళ స్టేషన్ల ఫోటోలు తీసిందని కొరియా మీడియా పేర్కొంది.
ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య తాత్కాలిక సంధిని మరో రెండు రోజులు పొడిగించినట్లు మధ్యవర్తి కతార్ సోమవారం ప్రకటించింది.మరో 33 మంది పాలస్తీనా ఖైదీల విడుదలతో పాటుగా గాజా నుండి మరో 11 మంది బందీలను వదిలిపెట్టిన తరువాత సంధి పొడిగింపు జరిగింది.
14 మంది సిబ్బందితో ఉప్పును తీసుకెళ్తున్న కార్గో షిప్ లెస్బోస్ ద్వీపంలో మునిగిపోవడంతో ఒకరు మరణించగా, 12 మంది తప్పిపోయినట్లు గ్రీక్ కోస్ట్ గార్డ్ తెలిపింది.కొమొరోస్-ఫ్లాగ్డ్ రాప్టర్ ఈజిప్ట్‌లోని ఎల్ దేఖీలా ఓడరేవు నుండి ఇస్తాంబుల్‌కు బయలుదేరి వెడుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.
చైనాలో ప్రతి ఏటా జరిగే సివిల్ సర్వీస్ పరీక్షకు మూడు మిలియన్లకు పైగా అభ్యర్దులు హాజరయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్దాయిలో హాజరు ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన ఉద్యోగాన్ని పొందడం గురించి యువతలో పెరుగుతున్న ఆందోళనలను హైలైట్ చేస్తుందని పరిశీలకులు చెబుతున్నారు.
వివాహ వేడుక అనేది జీవితాంతం మరచిపోలేని వేడుక కాబట్టి ప్రతి ఒక్కరూ దానిని గుర్తుండిపోయేలా ఘనంగా చేసుకుందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి గాను కొంతమంది విదేశాలకు కూడ తరలి వెడుతున్నారు. ఇలా ఉండగా తన కుమార్తె ప్రత్యేక రోజును గుర్తుంచుకోవడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి చెందిన భారతీయ వ్యాపారవేత్త దిలీప్ పాప్లీ ఇటీవల ఒక ప్రైవేట్ విమానంలో వివాహాన్ని నిర్వహించారు.
మలేషియాలో పర్యటించే భారతదేశం మరియు చైనా పౌరులకు డిసెంబర్ 1 నుండి వీసా రహిత ప్రవేశాన్ని మలేషియా ప్రారంభించనున్నట్లు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రకటించారని బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. అంటే, ఇప్పుడు భారతీయులు మలేషియాకు వెళ్లడానికి వీసా తీసుకోవలసిన అవసరం లేదు. భారతీయ మరియు చైనా పౌరులు వీసా లేకుండా మలేషియాలో 30 రోజుల వరకు ఉండవచ్చు.
ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య బందీల విడుదల ఒప్పందంలో భాగంగా హమాసా్ 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, నలుగురు విదేశీయులను విడుదల చేసింది. దీని తరువాత ఇజ్రాయెల్ ఆదివారం 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ సంధి ఒప్పందం యొక్క నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ హమాస్ బందీల మార్పిడిని చాలా గంటలు ఆలస్యం చేసింది.
: పాకిస్తాన్‌లోని కరాచీలో రషీద్ మిన్హాస్ రోడ్‌లోని బహుళ అంతస్తుల షాపింగ్ మాల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 11 మంది మరణించగా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు, జియో న్యూస్ నివేదించింది. కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో మరణించిన వారి సంఖ్యను ధృవీకరించారు. భవనంలో వ్యక్తుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.