Last Updated:

North Korea:ఉత్తర కొరియా గూఢచారి ఉపగ్రహం వైట్ హౌస్,పెంటగాన్ ఫోటోలు తీసిందా ?

ఉత్తర కొరియా తన మొదటి గూఢచారి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపినట్లు పేర్కొంది, ఇది గత వారం కక్ష్యలోకి ప్రవేశపెట్టబడింది. ఈ ఉపగ్రహం వైట్ హౌస్, పెంటగాన్ మరియు సమీపంలోని యుఎస్ నావికాదళ స్టేషన్ల ఫోటోలు తీసిందని కొరియా మీడియా పేర్కొంది.

North Korea:ఉత్తర కొరియా గూఢచారి ఉపగ్రహం  వైట్ హౌస్,పెంటగాన్ ఫోటోలు తీసిందా ?

North Korea: ఉత్తర కొరియా తన మొదటి గూఢచారి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపినట్లు పేర్కొంది, ఇది గత వారం కక్ష్యలోకి ప్రవేశపెట్టబడింది. ఈ ఉపగ్రహం వైట్ హౌస్, పెంటగాన్ మరియు సమీపంలోని యుఎస్ నావికాదళ స్టేషన్ల ఫోటోలు తీసిందని కొరియా మీడియా పేర్కొంది. గ్వామ్‌లోని వైమానిక దళ స్థావరం, పెరల్ హార్బర్ మరియు యూఎస్ నేవీకి చెందిన కార్ల్ విన్సన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ల ఫోటోలు కూడా తీసినట్లు తెలిపింది.

డిసెంబర్ 1 నుండి నిఘా ప్రారంభం..(North Korea)

ఉపగ్రహం అధికారికంగా డిసెంబర్ 1 నుండి తన నిఘా మిషన్‌ను ప్రారంభిస్తుందని ఉత్తర కొరియా తెలిపింది. అయితే అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ రెండురోజుల ముందుగానే పనిచేయడం ప్రారంభిస్తుందని చెప్పింది. అయితే ఉపగ్రహం పనిచేస్తుందో లేదో బయటి ప్రపంచం నుండి ఎటువంటి నిర్ధారణ లేదు. ఉత్తర కొరియా తన కొత్త ఉపగ్రహం ద్వారా తీసిన చిత్రాలను బయటి ప్రపంచానికి ఇంకా విడుదల చేయలేదు.ఉత్తర కొరియా వాదనను అమెరికా స్వతంత్రంగా ధృవీకరించలేమని వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి తెలిపారు. బాలిస్టిక్ క్షిపణి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంతరిక్ష ప్రయోగ వాహనాన్ని ప్రయోగించడాన్ని అమెరికా ఖండిస్తున్నదని, ఇది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమేనని అమెరికా ప్రతినిధి తెలిపారు.