Home / అంతర్జాతీయం
ప్రపంచంలో ఏదో ఓ మూల రోజూ మరణ వార్తలు వింటూనే ఉన్నాం. అందులోనూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాని వలసవెళ్లే వారూ ఉంటారు. కాగా తాజాగా సిరియాలో ఘోర ప్రమాదం జరిగింది. సిరియా తీరంలో బోటు బోల్తాపడి దానిలోని 77 మంది ప్రయాణికులు మృతి చెందారు. మృతులంతా వలసదారులుగా అధికారులు గుర్తించారు.
స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా మాంసం తినడం ద్వారా వాతావరణ విపత్తుకు కారణమవుతున్నారని కనుగొన్న ఒక అధ్యయనం ఆధారంగా ’పెటా‘ (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) మాంసాహారాన్ని తినే పురుషులపై సెక్స్ స్ట్రైక్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా మహిళలను కోరుతోంది.
ఇరాన్లో నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి. హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు రోజురోజు తీవ్రరూపం దాల్చుతున్నాయి. వరుసగా ఎనిమిదో రోజూ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలతో రోడ్డెక్కారు. ఇప్పటి వరకు సుమారు 50 మంది మృతి చెందారు.
కరోనా కంటే డేంజర్ అయిన వైరస్ ఒకటి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది ఇప్పుడు గబ్బిలాల నుంచి మానవాళికి సోకుతుందని అమెరికన్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే స్వభావం ఉన్న ఈ వైరస్‌కు ఖోస్టా-2గా నామకరణం చేశారు.
ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. అచే ప్రావిన్స్‌లో సముద్రగర్భంలో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 6.2గా అధికారులు గుర్తించారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు.
సౌదీ అరేబియాలో భారీ ఎత్తున బంగారం, రాగి నిక్షేపాలు బయటపడ్డాయి. ముస్లింలకు పుణ్యక్షేత్రమైన మదీనాలో అపారమైన బంగారం, రాగి ఖనిజాలు ఉన్నట్టు గుర్తించామని సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించింది.
దాదాపు ఏడు నెలలుగా రష్యా తో కొనసాగుతోన్న యుద్ధంతో ఉక్రెయి న్ అతలాకుతలమవుతోంది. పుతిన్ సేనల దాడుల్లో పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పడం లేదు.
ఇరాన్‌లోనూ హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా నిరసన సెగలు వెల్లువెత్తాయి. హిజాబ్ ధరించనందుకు మహసా అమిని అనే యువతి ఆ దేశ పోలీసుల దాడిలో గత శనివారం మృతి చెందింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఇరాన్ నిరసనలతో అట్టుడుకుతుంది. అయితే వీటిని అణచివేసేందుకు ఇరాన్ భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ అణచివేతలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 31 మంది మరణించినట్లు ఓస్లో కేంద్రంగా పనిచేస్తున్నఎన్జీనో సంస్థ వెల్లడించింది.
పాకిస్ధాన్ ముస్లిం లీగ్ అధినేత నవాజ్ షరీష్ ను విభేధిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించారు. పాకిస్థానలో ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మోదీని ఉదహరిస్తూ నవాజ్ ను ఏకిపారేసారు.
సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌లో దారుణం చోటు చేసుకొంది. ఓ పాఠశాలపై సైనిక హెలికాప్టర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 7 Children Among 13 Killed After Myanmar Army Helicopter Attacks School