Home / అంతర్జాతీయం
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి కొన్ని దేశాలు అల్లాడుతున్నాయి. దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాను భారీవర్షాలు అతలాకుతలం చేశాయి. భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని కారకాస్‌కు సమీపంలోని లాస్ టెజెరస్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీనితో 22 మంది మృతి చెందగా మరో 52 మంది గల్లంతయ్యారు.
కొన్ని రాత్రులను మరవలేము. ఈ రాత్రంతా ఇలానే ఉంటే ఎంత బాగుండో అని ఏదో ఒక సందర్భంలో అనుకునే ఉంటాం కాదా. కొన్ని నెలల పాటు అసలు సూర్యుడు ఉదయించని ప్రాంతాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా. నిజమేనండి ఆ ఊర్లల్లో శీతాకాలంలో కొద్ది రోజుల పాటు సూర్యుడు ఉదయించని రోజులు ఉంటాయంట వాటిని పోలార్ నైట్స్ అంటారు అలా సుదీర్ఘంగా రాత్రిగానే ఉండే ఊర్లేంటో తెలుసుకుందామా.
మెక్సోకో దేశంలో వరుసగా మూడోసారి విద్యార్థులపై విషప్రయోగం జరిగింది. దక్షిణ మెక్సికో రాష్ట్రమైన చియాపాస్ లో గ్రామీణ మాధ్యమిక పాఠశాలలో చదువుతున్న 57 మంది విద్యార్థులపై గుర్తుతెలియని పదార్థంతో విషప్రయోగం చేశారు.
ఇటీవలి కాలంలో న్యూయార్కు నగరంలోకి వేలాది మంది అక్రమ వలసదార్లు పొటెత్తడంతో న్యూయార్కు మేయర్ ఎరిక్ ఆడమ్స్ నగరంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధించారు.
హిందూ దేవాలయాలపై గత కొన్ని రోజులుగా వివిధ దేశాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోని పురాతన హిందూ దేవాలయంపై కొందరు దుండగులు దాడి చేశారు. ఆలయంలోని దేవతా విగ్రహాన్ని ధ్వసం చేశారు. ఈ ఘటన ఇప్పుడు ఆ దేశమంతటా కలకలం సృష్టిస్తోంది.
పాకిస్తాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్ చైర్మన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించాలని చూస్తోంది .
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ లో జేబెల్ అలీ ప్రాంతంలోని వర్షిప్ గ్రామంలో కొత్తగా నిర్మించిన హిందూ టెంపుల్ పేరుతో కొత్త ఆలయాన్ని భక్తుల దరి చేర్చారు. విజయదశమి పర్వదినం నుండి ఆలయాన్ని దర్శించుకొనేందకు భక్తులకు అనుమతి కల్గించారు
భారత ప్రభుత్వం చమురును ఎక్కడి నుండైనా కొనుగోలు చేయడం కొనసాగిస్తుందని, ఏ దేశమూ భారత్‌ను కొనుగోలు చేయడం మానేయమని చెప్పలేదని కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.
వజ్రాలంటేనే అధిక ధరలు ఉంటాయని తెలుసు కానీ ఆ ఒక్క డైమెండ్ మాత్రం వజ్రాలకే రారాజుగా నిలిచింది. హాంకాంగ్‌లో శుక్రవారం నిర్వహించిన వజ్రాల వేలంలో పింక్ స్టార్ డైమండ్ అత్యధికంగా రూ. 412.29 కోట్లు పలికింది.
భారత్ లో పర్యటించే తన పౌరులకు అమెరికా హెచ్చరికలు సూచించింది. నేరాలు, ఉగ్రవాద ముప్పులు పొంచివున్నాయని పేర్కొనింది. దీంతో మరీ ముఖ్యంగా జమ్మూ, కశ్మీర్ ప్రాంతాలకు వెళ్లవద్దని అమెరికా పౌరులకు విజ్నప్తి చేసింది