Last Updated:

America: భారత్ కు వెళ్లుతున్నారా? తస్మాత్ జాగ్రత్త… అమెరికా

భారత్ లో పర్యటించే తన పౌరులకు అమెరికా హెచ్చరికలు సూచించింది. నేరాలు, ఉగ్రవాద ముప్పులు పొంచివున్నాయని పేర్కొనింది. దీంతో మరీ ముఖ్యంగా జమ్మూ, కశ్మీర్ ప్రాంతాలకు వెళ్లవద్దని అమెరికా పౌరులకు విజ్నప్తి చేసింది

America: భారత్ కు వెళ్లుతున్నారా? తస్మాత్ జాగ్రత్త… అమెరికా

India: భారత్ లో పర్యటించే తన పౌరులకు అమెరికా హెచ్చరికలు సూచించింది. నేరాలు, ఉగ్రవాద ముప్పులు పొంచివున్నాయని పేర్కొనింది. దీంతో మరీ ముఖ్యంగా జమ్మూ, కశ్మీర్ ప్రాంతాలకు వెళ్లవద్దని అమెరికా పౌరులకు విజ్నప్తి చేసింది.

భారత్-పాకిస్థాన్ భూభాగంలోని 10కి.మీ దూరంలో అసలు ప్రయాణించవద్దని పేర్కొనింది. భారత దేశంలో అత్యాచార ఘటనలు పెరిగాయని, పర్యాటక, ఇతర ప్రదేశాల్లో లైంగిక దాడులు చోటు చేసుకొంటున్నట్లు ఆ దేశ (భారత్) అధికారులు పేర్కొన్నట్లు అమెరికా తన పౌరులకు తెలియచేసింది.

పర్యాటక ప్రదేశాలు, రవాణా హబ్ లు, రద్దీ మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ ప్రాంగణాలపై ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ మొదలు బెంగాల్ లోని పశ్చిమ భాగం వరకూ ఉన్న ప్రాంతాల్లో తమ పౌరులకు అత్యవసరం సేవలు అందించే సామర్ధ్యం అమెరికా ప్రభుత్వానికి చాలా పరిమితంగా ఉందిని వివరించింది.

ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ కొత్తగా ప్రయాణ సూచనలను జారీ చేసింది. తమ ఉద్యోగులు అక్కడకు వెళ్లాలంటే ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపింది. అయితే భారత్ లో ని ముప్పు స్ధాయి పెద్ద తీవ్రతను చూపించడం లేదని అమెరికా పేర్కొనింది. ప్రస్తుతానికి లెవల్ 2లో ఉందని వ్యాఖ్యానిస్తూ, పాకిస్థాన్ లెవల్ 3లో ఉన్నట్లు అమెరికా పేర్కొనింది. లెవల్ 4 లో ఉంటేనే ముప్పును అధిక  తీవ్రతగా గుర్తించాలని పేర్కొనింది. కల్లోల ప్రావిన్స్ లకు వెళ్లవద్దని పౌరులను కోరింది. భారత దేశాన్ని సందర్శించే క్రమంలో పునరాలోచన చేయాలని తన దేశ పౌరులకు అమెరికా సూచించింది.

ఇది కూడా చదవండి: Mexico: మెక్సికోలో దారుణం..18 మందిని కాల్చి చంపిన ముష్కరులు

ఇవి కూడా చదవండి: