Home / అంతర్జాతీయం
దాదాపు ఏడు నెలలుగా రష్యా తో కొనసాగుతోన్న యుద్ధంతో ఉక్రెయి న్ అతలాకుతలమవుతోంది. పుతిన్ సేనల దాడుల్లో పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పడం లేదు.
ఇరాన్‌లోనూ హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా నిరసన సెగలు వెల్లువెత్తాయి. హిజాబ్ ధరించనందుకు మహసా అమిని అనే యువతి ఆ దేశ పోలీసుల దాడిలో గత శనివారం మృతి చెందింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఇరాన్ నిరసనలతో అట్టుడుకుతుంది. అయితే వీటిని అణచివేసేందుకు ఇరాన్ భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ అణచివేతలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 31 మంది మరణించినట్లు ఓస్లో కేంద్రంగా పనిచేస్తున్నఎన్జీనో సంస్థ వెల్లడించింది.
పాకిస్ధాన్ ముస్లిం లీగ్ అధినేత నవాజ్ షరీష్ ను విభేధిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించారు. పాకిస్థానలో ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మోదీని ఉదహరిస్తూ నవాజ్ ను ఏకిపారేసారు.
సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌లో దారుణం చోటు చేసుకొంది. ఓ పాఠశాలపై సైనిక హెలికాప్టర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 7 Children Among 13 Killed After Myanmar Army Helicopter Attacks School
ప్రపంచంలోని మొట్టమొదటి క్లోన్ చేయబడిన వైల్డ్ ఆర్కిటిక్ తోడేలును బీజింగ్‌కు చెందిన సినోజీన్ బయోటెక్నాలజీ వీడియోలో ప్రదర్శించింది.
తెలుగురాష్ట్రాల్లో ఓలా తర్వాత అంత క్రేజ్ ఉబర్ ట్యీక్సీ సర్వీస్ కే ఉందనే చెప్పవచ్చు. కాగా ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటర్నెట్ ట్యాక్సీ సర్వీసెస్ అయిన ఈ ఉబర్ హ్యాకింక్ కు గురైంది. సంస్థకు చెందిన ఓ ఉద్యోగి వర్క్ స్పేస్ మెసేజింగ్ యాప్ లోకి హ్యాకర్లు చొరబడ్డారు. దానితో ఉబర్ డేటా హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఉబర్ సంస్థ అఫీసియల్ గా వెల్లడించింది.
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియలు ముగిసాయి. అంతిమయాత్రను అధికారిక లాంఛనాలతో సంప్రదాయబద్దంగా నిర్వహించారు.
మెక్సికోలో ఒక్కసారిగా భూమి దద్దరిల్లింది. మెక్సికో సెంట్రల్ పసిఫిక్ తీరంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని ఆ దేశ భూకంప శాస్త్ర సంస్థ తెలిపింది.
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా మరో ఘనత సాధించాడు. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్లో 4 పతకాలు గెలిచిన తొలి రెజ్లెర్ గా బజరంగ్ చరిత్రకెక్కాడు.
ఆత్మహత్యకు యత్నించిన ఒక వృద్ధురాలు ఏకంగా 55 బ్యాటరీలు మింగేసింది. ఆఖరికి వైద్యులు ఆమెకు సర్జరీ చేసి వాటిని బయటకు తీశారు. ఈ ఘటన ఐర్లాండ్ దేశంలో చోటుచేసుకుంది.