Home / అంతర్జాతీయం
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అబుదబిలోని బాప్స్ హిందూ దేవాలయాన్ని సందర్శించారు. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా లభించిన వెంటనే ఆయన బాప్స్ హిందూ దేవాలయాన్ని సందర్శించినట్లు తన ఎక్స్ ఖాతాలో వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేశారు.
బ్రిటన్‌లో జూలై 4న జనరల్ ఎలక్షన్స్ జరుగనున్నాయి. ప్రధానమంత్రి రిషి సునాక్ బుధవారం నాడు ఎన్నికల తేదీని ప్రకటించారు. అయితే ఈ సారి ఎన్నికల్లో అధికార కన్సర్వేటివ్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్‌తో భేటీ అయ్యారు. బ్రిటన్ -నేపాల్ దేశాల మధ్య మైత్రీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బ్రిటన్‌లో సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా నేపాల్ తరపున ప్రాతినిధ్యం వహించారు.
బంగ్లాదేశ్ ఎంపీ కోలకతాలో మిస్సింగ్.. అయితే పోలీసులు ఆయన హత్యకు గురై ఉంటాడని భావిస్తున్నారు. కాగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా పార్టీకి చెందిన ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్. ఆయన ఈ నెల 12న బంగ్లాదేశ్ నుంచి కోలకతాకు వైద్య చికిత్స కోసం వచ్చారని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడం.. ప్రతీకారంగా ఇజ్రాయెల్ హమాస్‌ను కోలుకోలేని దెబ్బతీస్తోంది. గాజాను నేల మట్టం చేసింది. అయితే తాజా పరిణామాల విషయానికి వస్తే ప్రపంచంలోని పలు దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడానికి ముందుకు వచ్చాయి.
నైజీరియాలో దారుణంగా చోటు చేసుకుంది. ఉత్తర మధ్య పీఠభూమిలో జురాక్ గ్రామంలో తుపాకీ ధరించిన ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 40 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు.
గత వారం కిర్గిస్థాన్‌లోని బిష్కెక్ లో భారతీయ విద్యార్థులను అక్కడి స్థానికులు చితకబాదిన విషయం తెలిసిందే. అక్కడ మెడిసిన్ చదువుతున్న తెలుగు విద్యార్థులు ప్రైమ్ 9తో మాట్లాడి తమ గోడును వెలిబుచ్చుకున్నారు
:ప్రపంచాన్ని గడగడ వణించిన కరోనా మరో మారు తిరిగబెట్టిందా అంటే అవుననే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల సింగపూర్‌లో కోవిడ్ -19 కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నెల 5 నుంచి 11 వరకు చూస్తే ఏకంగా 25,900 కేసులు పెరిగిపోయాయి.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ.. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అజర్ బైజాన్‌కు వెళ్లి వస్తుండగా హెలికాప్టర్ కూలిపోయింది. నిన్న వాతావరణ అనుకూలించక హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది
ఇండియా నుంచి మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థులు ప్రస్తుతం కిర్గిస్తాన్‌లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.