Donald Trump: యూఎస్ విద్యావ్యవస్థలో మార్పులు.. మూసివేత దిశగా అడుగులు వేస్తున్న డొనాల్డ్ ట్రంప్!

Donald Trump to order plan to shut down US education department: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మేరకు తాజాగా, యూఎస్ విద్యాశాఖ మూసివేతకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసే అవకాశం ఉందంటూ అంతర్జాతీయ మీడిలో కథనాలు వస్తున్నాయి. అయితే, ఉదారవాద భావజాలంతో విద్యాశాఖ కలుషితమైందని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో విద్యాశాఖలో అనవసర ఖర్చులు తగ్గించడంలో భాగంగా ఇప్పటికే భారీగా ఉద్యోగాల కోతలు విధించారు.
ఇదిలా ఉండగా, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఖర్చుల తగ్గింపుపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే విద్యాశాఖను మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. విద్యాశాఖను మూసివేసేందుకు సంబంధిత శాఖ అధికారాలను రాష్ట్రాలకు తిరిగి అందించేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా అమెరికాకు చెందిన ప్రజలకు సైతం సేవలు అంతరాయం లేకుండా సజావుగా సాగేలా చొరవ తీసుకురావాలని అమెరికా విద్యాశాఖ మినిస్టర్ లిండా మెక్ మాన్‌ను ఉద్దేశిస్తూ వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్‌ను అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
కాగా, అంతకుముందు విద్యాశాఖలో తన సిబ్బందిలో దాదాపు సగం మందిని తీసివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, విద్యాశాఖను పూర్తిగా మూసివేత అనే అంశం అంతా ఆషామాషీ కాదని, అమెరికా చట్టసభల అనుమతి లేకుండా ఈ శాఖను మూసివేయడం అసాధ్యమని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే లిండా మెక్ మాన్ విద్యాశాఖ మంత్రిగా పదవి చేపట్టిన కొన్ని రోజుల వ్యవధిలోనే ట్రంప్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.