America Cat Job: పిల్లికి ఎయిర్ పోర్టులో ఉద్యోగం.. అది చేసే పనేంటో తెలుసా..?
America Cat Job: ఈ పోటీ ప్రపంచంలో ఓ ఉద్యోగం రావాలంటే నానా తిప్పలు పడాల్సి వస్తుంది. అలాంటిది మనుషులకే ఉద్యోగాలు లేక చస్తున్న రోజుల్లో పెంపుడు జంతువులు ఈజీగా ఉద్యోగాలు చేస్తున్నాయి. జంతువులు ఉద్యోగం చెయ్యడం ఏంటా అని ఆలోచిస్తున్నారు కదా.. మీరు విన్నది నిజమేనండి.
America Cat Job: ఈ పోటీ ప్రపంచంలో ఓ ఉద్యోగం రావాలంటే నానా తిప్పలు పడాల్సి వస్తుంది. అలాంటిది మనుషులకే ఉద్యోగాలు లేక చస్తున్న రోజుల్లో పెంపుడు జంతువులు ఈజీగా ఉద్యోగాలు చేస్తున్నాయి. జంతువులు ఉద్యోగం చెయ్యడం ఏంటా అని ఆలోచిస్తున్నారు కదా.. మీరు విన్నది నిజమేనండి.. పోలీస్ డిపార్ట్ మెంట్లో ఇన్వస్టిగేషన్ సమయంలో డాగ్స్ ఉపయోగపడుతుండడం మనం చూశాం కానీ అదే ఓ పిల్లి పోలీస్ డిపార్ట్ మెంట్లో పని చెయ్యడం చూశామా.. నిజంగానే ఓ పిల్లి ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తోంది. మరి ఎక్కడ ఈ పిల్లి వర్క్ చేస్తుంది అసలు పిల్లికి ఉద్యోగం ఎందుకు ఇచ్చారు అనేది చూసేద్దాం
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ‘డ్యూక్ ఎల్లింగ్టన్ మోరిస్’ అనే ఓ పిల్లి ఉద్యోగం చేస్తోంది. ఆ పిల్లికి ఎయిర్ పోర్టులో పనిచేసే ఆఫీసర్లంతా కూడా గౌరవం ఇస్తూ.. చాలా మర్యాదగా చూసుకుంటున్నారు. ఈ పిల్లికి కూడా ఎయిర్ పోర్టులో పనిచేసే సిబ్బంది మాదిరిగానే యూనిఫాం కూడా ఉంది. నెత్తిమీద టోపీ, యూనిఫాంతో భలే ముద్దుగా కనిపిస్తోంది డ్యూక్.
పిల్లి చేసే పనేంటో తెలుసా(America Cat Job)
తెలుపు, నలుగు రంగుల్లో ముద్దుగా ఉన్న ఆ పిల్లిని చూసిన ప్రయాణీకులు ఏ వీఐపీకో సంబంధించిన పెంపుడు పిల్లి అయ్యి ఉంటుందని అనుకున్నారు. కానీ అది అక్కడ ఉద్యోగి అని తెలిసి నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ ఈ పిల్లి చేసే ఉద్యోగం ఏంటంటే ప్రయాణికులు భయపడకుండా వారిని ఎంటర్టైన్ చెయ్యడం. అర్థం కాలేదు కదా.. సాధారణంగా ఎవరైనా ఫస్టు టైమ్ విమానం ఎక్కితే భయపడతుంటారు. ఆ భయంతో వారు ఆందోళనకు గురికావడం, మానసిక ఒత్తిడితో వారు పడుతున్న పాట్ల వల్ల ఎయిర్ పోర్టులో కొన్ని గందరగోళ పరిస్థితిలు నెలకొంటుంటాయి. అలాంటి ప్రయాణికులు ఎటువంటి టెన్షన్ పడకుండా చాలా జాలీగా ప్రయాణం చేసేలా చెయ్యడమే ఈ పిల్లిగారి డ్యూటీ అనమాట.
సాధారణంగా జంతువులతో ఆడుకుంటే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుందని.. ఒత్తిడిని జయించవచ్చని కొందరు మానసిక వైద్య నిపుణులు చెబుతుంటారు. అందుకోసమే ఈ పిల్లిని ట్రైన్ చేసి మరీ ఎయిర్ పోర్టులో ఉద్యోగం ఇచ్చారంట అక్కడి అధికారులు. యూనిఫామ్ వేసుకుని, నెత్తిమీద టోపీ పెట్టుకుని అటు ఇటూ చకచకా తిరుగుతూ ఈ క్యూట్ గా ఉన్న ఈ పిల్లిని చూస్తే ఎంతటి ఆందోళనలో ఉన్నా సరే అది మాయం అయ్యి కాస్త హుషారుగా మారిపోతారంటున్నారు ఎయిర్ పోర్టులోని సిబ్బంది. ఈ పిల్లితో కాసేపు గడిపితే ప్రయాణం గురించిన టెన్షన్ మొత్తం పోయి భయపడకుండా ప్రయాణం పూర్తిచేయొచ్చని అధికారులు చెబుతున్నారు.