Last Updated:

Rahul Gandhi Truck Ride: వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వరకు ట్రక్ లో ప్రయాణించిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్ వరకు ట్రక్కులో ప్రయాణించారు.ట్రక్ రైడ్ సమయంలో అతను కొన్ని పాటలను ప్లే చేయమని డ్రైవర్‌ను అభ్యర్థించారు.  ఏ పాట అని అడిగినప్పుడు, అతను సిద్ధూ మూస్ వాలా యొక్క 295 పాటను ప్లే చేయండిఅని బదులిచ్చారు.

Rahul Gandhi Truck Ride: వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వరకు ట్రక్ లో ప్రయాణించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi Truck Ride:  కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్ వరకు ట్రక్కులో ప్రయాణించారు.ట్రక్ రైడ్ సమయంలో అతను కొన్ని పాటలను ప్లే చేయమని డ్రైవర్‌ను అభ్యర్థించారు.  ఏ పాట అని అడిగినప్పుడు, అతను సిద్ధూ మూస్ వాలా యొక్క 295 పాటను ప్లే చేయండిఅని బదులిచ్చారు.

అమెరికాలో  సౌకర్యంగా ట్రక్కులు..(Rahul Gandhi Truck Ride)

ఈ మొత్తం ప్రయాణ వీడియోను రాహుల్ గాంధీ కూడా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు. ఇందులో అతను భారతీయ డ్రైవర్‌తో తన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రయాణంలో, రాహుల్ గాంధీ భారతీయ ట్రక్ డ్రైవర్ నుండి తన ఆదాయంతో పాటు అతని దినచర్య గురించి తెలుసుకున్నారు. డ్రైవర్ తజిందర్ సింగ్ తో మాట్లాడిన రాహుల్ గాంధీ అమెరికాలో ట్రక్కులు డ్రైవర్ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయని అన్నారు. అయితే భారతదేశంలోని ట్రక్కుకు డ్రైవర్ సౌకర్యానికి సంబంధం లేదని అన్నారు. అంటే ఇది డ్రైవర్ కోసం తయారు చేయబడలేదని అంటే సౌకర్యంగా లేవన్నారు.

భారత్ లో డ్రైవర్ల పరిస్దితి కష్టంగానే..

మీరు ఎంత సంపాదిస్తారు?” అని రాహుల్ గాంధీ డ్రైవర్‌ను ప్రశ్నించారు. దానికి అతను భారతదేశంలో సంపాదిస్తున్న దానికంటే చాలా ఎక్కువ జీతం పొందుతానని బదులిచ్చారు
భారతదేశం మరియు యుఎస్‌లో డ్రైవర్లకు పని పరిస్థితులు ఎలా భిన్నంగా ఉంటాయో ఇద్దరూ చర్చించారు.భారతదేశంలోని డ్రైవర్లు 15 రోజులు లేదా ఒక నెల పాటు ఇంటికి దూరంగా ఉంటారని తజిందర్ సింగ్ అన్నాడు. అమెరికాలో డ్రైవర్లు బాగా డబ్బు సంపాదిస్తారు బ్రతుకుతారని కానీ భారతదేశంలో డ్రైవర్లు బ్రతకడం చాలా కష్టమన్నాడు. భారతదేశంలో చాలా మంది డ్రైవర్లకు సొంత ట్రక్కులు లేవు, వారు ఇతరుల ట్రక్కులను నడుపుతారని తెలిపాడు.

ప్రయాణంలో, పంజాబీ గాయకుడు సిద్ధూ ముసేవాలా హత్య గురించి కూడా డ్రైవర్ ప్రస్తావించాడు. కాంగ్రెస్ నాయకుడిని చంపేశారని, తనకు ఇంకా న్యాయం జరగలేదని డ్రైవర్ రాహుల్ గాంధీకి చెప్పాడు. దానికి సమాధానంగా రాహుల్ గాంధీ కూడా అవుననే సమాధానం ఇచ్చారు.రాహుల్ గాంధీ గత నెలలో ఢిల్లీలో ట్రక్కు ఎక్కి సిమ్లాకు వెళ్లారు. ప్రయాణంలో రాహుల్ గాంధీ డ్రైవింగ్‌లో ఎదురయ్యే సమస్యల గురించి డ్రైవర్‌తో మాట్లాడారు.