HBD King Nagarjuna: హ్యాపీ బర్త్ డే కింగ్ నాగార్జున
నేడు నాగార్జున 63 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.అక్కినేని నాగార్జున అగష్టు 29న 1959 లో జన్మించారు.నాగార్జున 100 కి పైగా సినీమాల్లో నటించిన ఇప్పటికి మన్మధుడు గానే ఉంటాడు. ఒకప్పుడు టాలీవుడ్ నాలుగు స్తంభాల్లో నాగర్జున కూడా ఒకరు.
HBD King Nagarjuna: నేడు నాగార్జున 63 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.అక్కినేని నాగార్జున అగష్టు 29న 1959 లో జన్మించారు.నాగార్జున 100 కి పైగా సినీమాల్లో నటించిన ఇప్పటికి మన్మధుడు గానే ఉంటాడు. ఒకప్పుడు టాలీవుడ్ నాలుగు స్తంభాల్లో నాగర్జున కూడా ఒకరు. జోనర్ ఏది ఐన సరే మన కింగ్ నాగ్ స్టైల్ మాస్ లాగా ఉంటుంది.కథలను ఎంచుకునే విషయంలో కింగ్ నాగార్జున తరువాతే ఎవరైనా..భక్తి సినిమాల నుంచి యాక్షన్ సినిమాల వరకు మంచి కథలను ఎంపిక చేసుకుంటారు.
నాగార్జున మొదటి సినిమా విక్రమ్.ఈ సినిమా 1986 మే 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నాగార్జున తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించారు.ఇప్పటి వరకు నాగార్జున 9 నంది పురస్కారాలను అందుకున్నారు.సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బుల్లితెర పై కూడా నాగార్జున సందడి చేశారు. బుల్లితెర పై ఆయన చేసిన షోలు కూడా బాగా పాపులర్ అయ్యాయి.ఆయన చేసిన షోలు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ వంటి మెగా షోలో హోస్ట్ గా చేశారు.ప్రస్తుతం అక్కినేని నాగార్జున కుంటుబానికి , ఆయనే డెసిషన్ మేకర్ .నాన్న అనుసరించిన మార్గాలను నాగార్జున కూడా నడుస్తూ జనాన్ని,ఆయన అభిమానులందరిని అలరిస్తున్నారు..తండ్రి అక్కినేని నాగేశ్వరరావు బాధ్యతలన్ని ఆయన భుజం మీద వేసుకొని అన్న పూర్ణ స్టూడియోస్ బాధ్యతలు ఆయన చూసుకుంటున్నారు. మరి నాగార్జున లాగే వారి అక్కినేని నాగ చైతన్య , అక్కినేని అఖిల్ ఆ బాధ్యతలను తీసుకుంటారో ? లేదో ? వేచి చూడాలి. నాగార్జున నటునిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా ఇలా అన్నింటిని మన కింగ్ నాగ్ మేనేజ్ చేస్తున్నారు .
ఇంత బిజీ బిజీగా ఉండే మన కింగ్ నాగార్జున నేడు పుట్టినరోజును జరుపుకుంటున్నారు.కింగ్ నాగార్జున ఇలాగే మరెన్నో పుట్టినరోజులను జరుపుకోవాలని, మనల్ని అలరిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం.