Pawan Kalyan Birthday: హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్లంటూ ఎవరు ఉండరు. పెద్ద అన్నయ్య 'మెగాస్టార్' చిరంజీవి ముద్దుల తమ్ముడు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన నటన, డ్యాన్స్ ముఖ్యంగా చెప్పు కోవాలిసిన పవర్ స్టార్ మేనరిజం ప్రేక్షుకులను బాగా ఆకట్టుకున్నాయి.
Tollywood: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్లంటూ ఎవరు ఉండరు. పెద్ద అన్నయ్య ‘మెగాస్టార్’ చిరంజీవి ముద్దుల తమ్ముడు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన నటన, డ్యాన్స్ ముఖ్యంగా చెప్పు కోవాలిసిన పవర్ స్టార్ మేనరిజం ప్రేక్షుకులను బాగా ఆకట్టుకున్నాయి. అన్ని ఒడిడుకులను దాటుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు. సినిమా సినిమాకు కొత్త బాడీ లాంగ్వెజ్ ను మెయింటైన్ చేస్తూ ‘పవర్ స్టార్’ అయ్యారు. పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి మన ప్రత్యేకంగా మాట్లాడలిసిన అవసరం లేదు. పవన్ కల్యాణ్ ఒక్క మాట చెప్తే చాలు అభిమానులు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారన్న విషయం మన అందరికి తెలిసిందే. పవన్ అనే పేరు వినగానే ఎదో తెలియని ధైర్యం వచ్చేస్తుంది ఇంకా చెప్పాలంటే ఆయన కోసం ఆయన అభిమానులు వాళ్ళ ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. నేడు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు తెలుపుదాం.
సినీ జీవితం:
పవన్ కళ్యాణ్ సినీ కెరీయర్లో సూపర్ హిట్స్ సినిమాలు, హిట్ సినిమాలు, ప్లాప్ సినిమాలు ఉన్నాయి. సినిమాలు చేయనన్నా పవన్ ఆ మాటను వెనక్కి తీసుకొని నా అభిమానుల కోసం సినిమాలు చేస్తానని తెలిపారు. గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అనేది నేను చెప్పాలిసిన అవసరం లేదు. ఉత్తమ నటుడిగా ఈ సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ను కూడా అందుకున్నారు. ఇప్ప్పుడు అందరి చూపు హరి హార వీర మల్లు సినిమా పై పవన్ అభిమానులు అంచనాలు భారీగా పెట్టుకున్నారు.
ప్రజల సంతోషమే తన సంతోషంగా భావిస్తూ రాజకీయాల్లోకి జనసేనానిగా అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్:
పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వపరంగా మంచి మనసున్న మనిషి. నేటి సమాజంలో జరుగుతున్న అక్రమాలను చూసి ప్రజలకు ఎదో ఒకటి చేయాలి దేశం కోసం నా వంతు నేను కృషి చేయాలని పగలు రాత్రి అని తేడా లేకుండా ప్రజల కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించి ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికలలో ప్రధాని మోడీకు మరియు చంద్రబాబుకు మద్దతు పలికి వాళ్ళని గెలిపించారు. 2019 ఎన్నికల్లో బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ కు కేవలం ఒక్క సీటు మాత్రమే రావడం జరిగింది. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మనసులను గెలుచుకున్నారు. ఈ సారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలచి, ముఖ్యమంత్రి సీటులో కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జనసేన అధినేత, ప్రజల్లో గుండెల్లో దేవుడు, ప్రజా నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.