Ambati Rambabu : జగన్ పర్యటనలో నిషేదాజ్ఞల ఉల్లంఘన.. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసులు నమోదు

Cases Registered against former Minister Ambati Rambabu: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇటీవల వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటించగా, అంబటి నిషేదాజ్ఞలు ఉల్లంఘించారు. ఈ మేరకు అంబటిపై నల్లపాడు, పాత గుంటూరు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆయనతోపాటు పలువురు వైసీపీ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఇటీవల సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లో అంబటిపై కేసు నమోదైంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా కొర్రపాడు వద్ద అంబటి రాంబాబు తన సోదరుడు మురళితో కలిసి అరాచకం సృష్టించారు. బారికేడ్లు తోసి మరీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారించిన పోలీసులను కూడా నెట్టివేశారు. విధులకు ఆటంకం కలిగించి దాడి చేశారంటూ ఐపీసీ 188, 332, 353, 427 సెక్షన్ల కింద పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు.