Gandhi Tatha Chettu Trailer: ఆడపిల్ల పేరు గాంధీ ఏంటీ?, సుకుమార్ కూతురు నటించిన ‘గాంధీ తాత చెట్టు’ ట్రైలర్ చూశారా?
Gandhi Tatha Chettu Trailer Out: స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’ (Gandhi Tatha Chettu Trailer). పద్మావతి మల్లాది దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలపై నవీన్ ఎర్నేని, రవిశంకర్, శేష సింధు రావులు సంయుక్తంగా నిర్మించారు. సుకుమార్ భార్య తబితా సుకుమార్ ఈ చిత్రానికి సమర్పకురాలు. ఇప్పటికే ఈ సినిఆకు దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు వచ్చాయి.
ఈ సినిమా జనవరి 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా తాజాగా గాంధీ తాత చెట్టు ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా విడుదల చేసిన ఈ ట్రైలర్ ఎమోషనల్‌గా సాగింది. ఓ చిన్నపిల్ల తన తాతకు చెట్టుని కాపాడతానని మాట ఇస్తుంది. తాతకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ చెట్టుని ఎలా రక్షించిందనే ఈ సినిమా కథ.
గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది అనే కథాంశంలో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ట్రైలర్‌ను చూస్తే అర్థమైపోతుంది. గాంధీ పాత్రలో సుకుమార్ కూతురు సుకృతి ఎంతో అద్భుతంగా నటించింది. గాంధీ సిద్ధాంతాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. మరి థియేటర్లో ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.