Last Updated:

Niharika Konidela: మ్యాడ్ హీరోను లైన్లో పెట్టిన మెగా డాటర్..

Niharika Konidela: మ్యాడ్ హీరోను లైన్లో పెట్టిన మెగా డాటర్..

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం కెరీర్ లో సక్సెస్ అవ్వడానికి చాలా కష్టపడుతుంది. ఒకపక్క నటిగా.. ఇంకోపక్క నిర్మాతగా బిజీగా మారింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి అందులో మొదటి సినిమాగా కమిటీ కుర్రోళ్లు అనే సినిమాను నిర్మించింది. కొత్త కుర్రాళ్లతో తెరకెక్కిన ఈ సినిమా..రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక భారీ విజయం తరువాత నిహారిక తన రెండో సినిమాను ప్రకటించింది.

 

వర్షం డైరెక్టర్ శోభన్ నట వారసులుగా చిన్నప్పుడే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. సంతోష్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ వస్తుంటే.. సంగీత్ చిన్న చిన్న పాత్రలలో మెరిశాడు. ఇక అతని జీవితాన్ని మార్చేసింది మ్యాడ్ సినిమా. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన మ్యాడ్ సినిమాలో దామోదర్ పాత్రలో సంగీత్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి.

 

మ్యాడ్ మంచి హిట్ అవండుకోవడంతో.. ఈ మధ్యనే మ్యాడ్ స్క్వేర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పటివరకు సెకండ్ హీరోగా .. వేరే హీరోలతో స్క్రీన్ పంచుకున్న సంగీత్.. మొట్ట మొదటిసారి సోలోహీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. నిహారిక.. ఆ అవకాశాన్ని సంగీత్ కి ఇచ్చింది.

 

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో నిహారిక నిర్మిస్తున్న రెండో సినిమాలో సంగీత్ సోలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తుంది. తాజాగా ఈ విషయాన్నీ నిహారిక అధికారికంగా ప్రకటించింది. “కొత్త ప్రాజెక్ట్. కొత్త కథ. సినిమా మీద అదే ప్రేమ. తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడానికి వేచి ఉండండి. ఏ జోనర్ లో వస్తున్నామో గెస్ చేయగలరా.. ? ” అంటూ నిహారిక రాసుకొచ్చింది.  

 

ఇక సంగీత్ .. అన్న సంతోష్ లా కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటున్నాడు. ఈ కథ కూడా తనకు చాలా స్పెషల్ అని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఏదిఏమైనా నిహారిక.. మ్యాడ్ హీరోను లైన్లో పెట్టి మంచి కథతోనే రానుందని తెలుస్తోంది. మరి ఈ చిత్రంతో నిహారిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.