Ram Gopal Varma: ఉమెన్స్ డే – స్త్రీ ఉనికి లేకుండ జీవించలేను.. ఆర్జీవీ ట్వీట్ వైరల్

Ram Gopal Varma Women’s Day Tweet: ఉమెన్స్ డే సందర్భంగా ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) చేసిన ట్వీట్ నెటిజన్స్‌ని ఆకట్టుకుంటోంది. ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏలాంటి అంశమైన తనదైన స్టైల్లో స్పందిస్తూ హాట్‌టాపిక్ అవుతుంటారు. ఆర్జీవీ రూటే సపరేట్. ఏలాంటి అంశాన్ని డిఫరెంట్‌గా చూస్తారు. అంతేకాదు దానిపై తన అభిప్రాయాన్ని కూడా మోహమాటం లేకుండ బయటపెడుతున్నారు.
ఈ క్రమంలో ఆయన చాలా మంది నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారు. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం ఆర్జీవీ తీరు, ఆయన కామెంట్స్ సలాం అంటారు. చాలా మంది ఆయనలా ఉండాలని కూడా అనుకుంటారు. ఆర్జీవీ సమాజంలో జరిగే అంశాలపై కూడా స్పందిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉమెన్స్ డే సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంలో రాజకీయ, సినీ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఆర్జీవీ కూడా విషెస్ తెలిపారు. అయితే ఇందులో భిన్నంగా కామెంట్స్ చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.
అంతా మహిళల ప్రాధాన్యతను, వారి ఉనికిని చాటిచెబుతూ ట్విట్స్ చేశారు. ఆర్జీవీ మాత్రం తనదైన స్టైల్ ప్రదర్శించాడు. “నా ఉనికి లేకుండ జీవించగలను. కానీ, స్త్రీ ఉనికి లేకుండ బతకలేను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలా మాట్లాడటం ఒక్క ఆర్జీవీ వల్లే అవుతుంది’, ‘ఇలా కూడా విషెస్ చెప్పోచ్చా!’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్జీవీ దర్శకత్వ ఆధ్వర్యంలో ‘శారీ’ మూవీని నిర్మిస్తున్నారు. దీనికి గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్జీవీ ప్రొడక్షన్‌లో ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
I can live without my existence , but i can’t live without women’s existence ..HAPPY WOMEN’S DAY🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) March 8, 2025