Last Updated:

Pooja Bedi Skirt: గాలికి ఎగిరిపోయిన పూజా బేడీ స్కర్ట్,, మూర్చపోయిన స్పాట్ బాయ్,,

సినిమా ఘూటింగ్‌లలో పలు చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని తమాషాగా ఉంటాయి. తాజాగా హిందీ కొరియాగ్రాఫర్‌ నుంచి ప్రస్తుతం దర్శకురాలిగా ఎదిగిన ఫరాఖాన్‌ ఒకరు. ఆమె తన మొట్టమొదటి పాటకు కొరియాగ్రఫీ చేసిన సంఘటనకు సంబంధించిన విశేషాలను చాట్‌ విత్‌ రేడియో నషాతో పంచుకున్నారు. ఆ విశేషాలు చూద్దాం.

Pooja Bedi Skirt: గాలికి  ఎగిరిపోయిన పూజా బేడీ స్కర్ట్,,  మూర్చపోయిన స్పాట్ బాయ్,,

Pooja Bedi Skirt: సినిమా ఘూటింగ్‌లలో పలు చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని తమాషాగా ఉంటాయి. తాజాగా హిందీ కొరియాగ్రాఫర్‌ నుంచి ప్రస్తుతం దర్శకురాలిగా ఎదిగిన ఫరాఖాన్‌ ఒకరు. ఆమె తన మొట్టమొదటి పాటకు కొరియాగ్రఫీ చేసిన సంఘటనకు సంబంధించిన విశేషాలను చాట్‌ విత్‌ రేడియో నషాతో పంచుకున్నారు. ఆ విశేషాలు చూద్దాం.

ఫరా ఖాన్‌ 1992 బ్లాక్‌ బస్టర్‌ మూవీ జో జితా వహి సికిందర్‌ సినిమా కోసం పహేలా నషా అనే పాటకు కొరియో గ్రఫీ చేస్తున్నారు. అయితే ఈ పాటను పూజా బేడీపై చిత్రీకరిస్తున్నారు. కాగా హాలీవుడ్‌ నటి మార్లిన్‌ మోన్రో స్కర్ట్‌ ఎగిరిపోయే సీన్‌ యావత్‌ ప్రపంచానికి సుపరిచితమే. ఆమె రెడ్‌ స్కర్ట్‌ ఎగిరిపోతుంటే ఆమె స్కర్ట్‌ను కిందికి లాగడానికి ప్రయత్నిస్తున్న సీన్‌ ఇప్పటికి మాస్టర్‌ పీస్‌గా చెప్పుకోవచ్చు.

స్కర్ట్ ను పట్టుకోలేక..(Pooja Bedi Skirt)

పహేలా నషా పాట షూట్‌లో పూజా బేడీతో మార్లిన్‌ మోన్రో సీన్‌ను రిపీట్‌ చేయించాలనుకున్నారు ఫరా… దీనికి అన్నీ సిద్దం చేశారు. పూజాను కారుపై నుంచోబెట్టారు. ఆమెకు సీన్‌ అర్ధమయ్యేలా చెప్పారు. కారు కింది నుంచి స్పాట్‌ బాయ్‌ ఫ్యాన్‌ ఆన్‌ చేసినప్పుడు స్కర్ట్‌ ఎగిరిపోకుండా కిందికి లాక్కుకోవాలని మార్లిన్‌ మెన్రో సీన్‌ గురించి వివరించారు ఫరా. అంతా సవ్యంగా జరుగుతోంది. స్పాట్‌ బాయ్‌ ఫ్యాన్‌ ఆన్‌ చేయడంతో పూజా బేడీ స్కర్ట్‌ను సరిగా అదుపు చేయలేకపోయింది. ఆమె స్కర్ట్‌ ఆమె తలపైకి వెళ్లింది. ఆమె వేసుకున్న సన్నిటి డ్రాయర్‌ కనిపించడంతో స్పాట్‌ బాయ్‌ కళ్లు బైర్లు కమ్మి అపస్మాకరస్థితిలోకి వెళ్లిపోయాడు. ఫరా కూడా తాను మొట్టమొదటిసారి ఇలాంటి సన్నటి డ్రాయర్‌ను చూశానని చెప్పారు. షూటింగ్‌ అయిపోయింది. పూజాబేడీ మాత్రం దీన్ని పట్టించుకోలేదు. బిందాస్‌గా తన పని తాను చేసుకుపోయిందన్నారు ఫరా.

ప్రస్తుతం ఫరా ఖాన్‌ బాలీవుడ్‌లో టాప్‌ కొరియాగ్రాఫర్‌. వాస్తవానికి ఈ పాటను సరోజ్‌ఖాన్‌ కొరియాగ్రఫీ చేయాల్సింది. ఆమె అత్యవసరంగా బాంబే వెళ్లాల్సి వచ్చింది. అక్కడ శ్రీదేవి, లేదా మాధురిపై పాటను చిత్రీకరించాల్సి వచ్చింది. వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. అప్పుడు తాను ఊటీలో కొన్ని షోలకు కొరియాగ్రఫీ చేస్తున్న.. సినిమా నిర్మాత మన్సూర్‌అలీ ఖాన్‌ తనను పిలిపించి వెంటనే ఈ పాటకు కొరియాగ్రఫీ చేయాలని కోరాడు. లేదంటే తాను పెద్ద ఎత్తున డబ్బు నష్టపోవాల్సి వస్తోందన్నాడు. ఒక్క రోజు సమయం కోరిన తర్వాత తాను షూట్‌ పూర్తి చేశాను .ఈ పాట బాగా సక్సెస్‌ అయ్యిందని ఫరా ఆనాటి ఘటనలను నెమరవేసుకున్నారు.

ఇవి కూడా చదవండి: