Ayurvedic Migraine Remedies: భరించలేని మైగ్రేన్ కు ఆయుర్వేదంలో అద్భుత ప్రయోజనాలు.!

Ayurvedic remedies to get relief of migraine: తలనొప్పి అంటేనే భరించలేనంత తలనొప్పి. ఇందుకు మరొక నిర్వచనం అవసరం లేదు. ఎందుకంటే ఇదంతగా బాధపెడుతుంది. ఈ తీవ్రమైన తలనొప్పిని మైగ్రేన్ అని అంటారు. తలలో చాలా భాగం భరించలేనంత నొప్పి వస్తుంది. ఇది సాధారణ తలనొప్పికి భిన్నంగా ఉంటుంది. ఈ మైగ్రేన్ వలన రోజువారి కార్యకలాపాలు గణనీయంగా ప్రభావితం అవుతాయి. ఇది కొన్ని గంటలు ఉంటుంది. అయితే ఇలాంటి తలనొప్పులు క్రమం తప్పకుండా సంభవిస్తే అలాగే ఉండిపోకుండా చికిత్స తీసుకోవాలి.
మైగ్రేన్ కు ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్స ఉందని అంటున్నారు నిపుణులు. దీన్ని ఆయుర్వేదంలో అర్ధాభేదక్ లేదా అర్ధశిషి అని పిలుస్తారు. ఈ రకమైన తలనొప్పి ఒక వైపు మాత్రమే విపరీతంగా నొప్పిపుడుతుంది. వాత, పిత్త దోషాల వలన ఇది కలుగుతుందని అంటున్నారు.
మైగ్రేన్ కు ఆయుర్వేదంలో చికిత్సా పద్దతులు
నాస్య: ప్రతి ఉదయం, రెండు నాసికా రంధ్రాలలో రెండు చుక్కల అను నూనె ( ఇది ఆయుర్వేద దుఖానాలలో దొరుకుతుంది) లేదా శతావరి నెయ్యి వేయండి. ఇది మెదడు మరియు నాడీ వ్యవస్థను శుద్ధి చేస్తుంది.
శుద్ధి: ఇది పిత్త దోషాన్ని నాశనం చేస్తుంది. దీని కోసం, త్రివృత్త లేహ్య మరియు హరితకి పొడిని తీసుకుంటారు. ఇది కాలేయం మరియు జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది.
శిరోధర: నువ్వుల నూనె, బ్రాహ్మి నూనె లేదా పాలను నిరంతరం తలపై పోస్తారు. ఈ ప్రక్రియ అపారమైన ప్రశాంతతను మరియు మానసిక విశ్రాంతిని ఇస్తుంది.
బస్తీ (ఎనిమా థెరపీ): వాత నియంత్రణ కోసం, అనువాసన బస్తీ (నూనె ఆధారిత) మరియు నిర్హర బస్తీ (కషాయం ఆధారిత) ఇవ్వబడతాయి.
వీటిని నిపుణుల సమక్ష్యంలోనే తీసుకోగలరు. ఆయుర్వేదంలో ఏ మందునైనా ఎక్కువగా సేవించకూడదు. ఎందుకంటే ఆయుర్వేదంలో చాలా పవన్ కలిగిన మూలకాలు ఉంటాయి. వీటి వలన వేడి చేస్తుంది.
ఇంట్లో ఉపయోగించే చిట్కాలు
అల్లం మరియు నిమ్మరసం సమాన పరిమాణంలో కలిపి ప్రతిరోజూ తాగడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
చల్లటి నీటితో స్నానం చేయండం ఉత్తమం. తలపొప్పికి మంచి ఉపశమాన్ని ఇస్తుంది. దీనివలన తలలోని వేడి తగ్గుతుంది.
నువ్వులు మరియు కర్పూరం నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల ప్రశాంతంత చేకూరుతుంది.
ఉదయం ఖాళీ కడుపుతో రెండు టీస్పూన్ల చెక్క ఆపిల్ ఆకు రసం తీసుకోండి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీర వేడి తగ్గుతుంది.
గమనిక.. పైన తెలిపిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వాడే ముందర నిపుణుల సలహా, లేదా ఆయుర్వేద డాక్టర్ల సూచన తీసుకోగలరు. కచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.