Mango for gut health: మామిడి పండ్లతో 4 అద్భుత ప్రయోజనాలు.! తెలిస్తే వదలరంతే.!

Mango for gut health: మామిడి పండు అంటే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా ఎగిరి గంతేస్తారు. భారతీయ ఫండ్లలో రాజు… మామిడి పండు. అందుకే ఇది జాతీయ ఫలం అయింది. వేసవికాలం వస్తేచాలు మామిడిహవా మామూలుగా ఉండదు. సీజన్ అయిపోతున్నా డిమాండ్ మాత్రం చెక్కుచెదరదు. అలాంటి మామిపండు రుచిలోనే కాదు పోషకాలలో కూడా మెండు. మామిడిపండు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలని అంటున్నారు నిపుణులు.
మామిడి పండ్లలో విషేశం ఏమిటంటే ఇందులో చాలా రకాలు దొరుకుతాయి. వాటిలో బంగినపల్లి, తోతాపురి, మల్గోవా, అల్ఫోన్సో మొదలైనవి ఉన్నాయి. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ, కె, బి6 మరియు ఫోలెట్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో చర్మం, జుట్టు ఆరోగ్యానికి మరియు రోగనిరోధక శక్తికి సహాయపడుతుంది.
మామిడి పండ్లు తినడం వలన గణనీయమైన ప్రయోజనాలు ఉన్నట్లు డాక్టర్లు తెలుపుతున్నారు. మామిడి పండును ప్రపంచ వ్యాప్తంగా ఇష్టంగా తింటారు. ఇది జీర్ణ సమస్యలకు, మలబద్దకానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో అధికంగా పోషకాలు లభిస్తాయి. మామిడి పండ్ల వలన ప్రేగులు (గట్) శుద్ది అవుతాయి. వీటితోపాటు మూత్రపిండాల ఆరోగ్యం మెరుగవుతుంది. మామిడి పండ్లు రుచికరంగా ఉండటంతోపాటు పోషకాలు, బయోయాక్టీవ్ తో నిండి ఉంటాయి.
మామిడిపండులో ప్రీబయోటిక్ ఫైబర్స్ ప్రేగులలోని బాక్టీరియా సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతో ఆరోగ్యకరమైన ప్రేగుల వ్యవస్థ మైక్రోబయోమ్ కు మద్దతు ఇవ్వగలదని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రేగుల కదలికను నియంత్రించడంలో, మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. మామిడి పండ్లలో నాలుగురకాలైన పోషకాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి.
మామిడి పండులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది
మామిడిలో కరిగే, కరగని ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మరియు ప్రేగుల కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మామిడిపండులో ఉన్న ఫైబర్ అనేది గట్ బ్యాక్టీరియాను పోషిస్తుంది. ఇది మైక్రోబయోమ్ కు మద్దతు ఇస్తుంది.
మామిడికాయల్లో మాంగిఫెరిన్ వంటి పాలీఫైనాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెండ్ లక్షణాలను కలిగి ఉంటాయి. పాలీఫెనాల్స్ గట్ బారియర్ పనితీరును మెరుగుపరుస్తాయి. మరియు గట్ బాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మామిడికాయలలోని సహజ ఎంజైమ్‌లు, అమైలేస్‌లు, కార్బోహైడ్రేట్‌లను విచ్ఛిన్నం చేయడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మామిడి పండ్లను తరచూ తినడంతో మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో పాటే ప్రేగులలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పోషిస్తాయి.
గమనిక. పైన తెలిపిన విషయాలు పాటించే ముందు డాక్టర్ల సలహా తప్పనిసరి తీసుకోవాలి. కచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.