Home / సినిమా
యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ చిత్రం అప్డేట్లు త్వరలోనే రానున్నాయి. వరుస ఫ్లాప్ ల తర్వాత ప్రభాస్ ఆదిపురుష్‌తో ప్రేక్షకుల ముందుకురానున్నాడు. అక్టోబర్ 3న ఆదిపురుష్ నుంచి టీజర్ లాంచ్ అనే రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా తాను రెబల్ స్టార్ కడసారి చూపుకు నోచుకోలేపోయానంటూ ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు నటుడు రాఘవ లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీజ ఆర్ట్స్ అండ్ బాచిన వైష్ణవ్ చౌదరి ఫిల్మ్స్ పతాకాలపై అమీర్, ప్రణీత, దీపిక జంటగా సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం "Eట్లు” మీకు తెలుసా. పందిళ్లపల్లి రోషిరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
బిగ్ బాస్ ఫేమ్ విజె సన్నీ, అషిమా హీరో హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం సకల గుణాభి రామ. ఈ సినిమాకు శ్రీనివాస్ వెలిగొండ దర్శకుడిగా వ్యవహరించగా సంజీవ్ రెడ్డి నిర్మాతగా ఉన్నారు.
మూవీ హిట్ కొడితే సాధారణంగా బాక్స్ బద్దలయ్యింది అంటాము కానీ మూవీ పేరే "బాక్స్ బద్దలవుద్ది" ఉంటే ఇంక ఆ సినిమాను మూవీ మేకర్స్ ఏ లెవల్లో తెరకెక్కించబోతున్నారో ఆలోచించండి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ చందన మూవీస్ బ్యానర్లో సీడీ నాగేంద్ర నిర్మాతగా, తల్లాడ సాయి క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కనుంది.
యంగ్ డైనమిక్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించి ప్రేక్షకులను మెప్పించిన చిత్రం కార్తికేయ 2. ఆగస్టు 13న విడుదలై ఘన విజయం సాధించిన ఈ మూవీ ఈ నెల చివర్లో ఓటీటీ వేదికపైకి కూడా రానుంది.
సూపర్‌స్టార్ మహేష్ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో కొత్త ప్రయోగానికి సిద్దామయ్యారనే చెప్పుకోవాలి.మహేష్ బాబు ఆయన అభిమానులు ఒక్కటే కాదు తెలుగు సినీ అభిమానులందరు ఆయన సినిమాల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
జనగణమన చిత్రం గురించి మర్చిపోండి అంటూ సైమా వేదికగా విజయ్ దేవకరకొండ చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కాగా నెటిజన్లు ఇంక జనగణమన ఆగిపోయినట్టేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిలో నిజానిజాలేంటో తెలియాలంటే పూరీ నోరువిప్పాల్సిందే.
బిగ్ బాస్ ఆట రోజు రోజుకు ఆసక్తి కరంగా మారుతుంది.బిగ్ బాస్ ఏ సమయంలో ఎవరెవరికి గొడవలు పెడతారో తెలీదు అలాగే ఏ సమయంలో ఎవరు గొంతెత్తి మాట్లాడతారో తెలీదు. నిన్నటి వరకు సైలెంటుగా ఉన్న రాజశేఖర్ ఒక్కసారిగా తన కోపాన్ని మొత్తాన్ని బయటికి వెళ్ళగక్కాడు.రెండో వారం నామినేషన్స్‌లో భాగంగా రాజశేఖర్ గట్టిగా విరచుకు పడ్డాడు.
రణ్‌భీర్ కపూర్, ఆలియా భట్ కలిసి నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’ ఈ సినిమా పాన్ ఇండియాగా వచ్చి హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రేంజులో వసూలు చేసి హిట్ టాక్ తో దూసుకెళ్తుంది.